ETV Bharat / state

JP Nadda on Telangana BJP Rebels : బీజేపీ రెబల్స్​తో జేపీ నడ్డా భేటీ.. తిరుగుబాటుకు చెక్..! - హైదరాబాద్​లో బీజేపీ పార్టీ నాయకుల కలిసిన నడ్డా

JP Nadda on Telangana BJP Rebels Hyderabad : బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలోని ఆ పార్టీ అసంతృప్తి నేతలను కలిశారు. తమ సమస్యలను హైకమాండ్​కు చెప్పుకుని తేల్చుకుంటామన్న నేతలు ఘట్​కేసర్​లో నిర్వహించిన పార్టీ మీటింగ్​కు వచ్చి.. నడ్డాను కలవడం ఆసక్తి కరంగా మారింది. నడ్డాను కలిసి నేతలు వారి అలక విరమించుకోవడంతో.. ఆయన వారికి ఎలాంటి హామీలు ఇచ్చారు అన్న అంశం చర్చనీయంగా మారింది.

JP Nadda
JP Nadda Meets Sulking BJP Leaders in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 7, 2023, 10:58 AM IST

JP Nadda on Telangana BJP Rebels బీజేపీ రెబల్స్​తో జేపీ నడ్డా భేటీ.. తిరుగుబాటుకు చెక్..

JP Nadda on Telangana BJP Rebels Hyderabad : బీజేపీ రాష్ట్ర రెబల్ లీడర్ల తిరుగుబాటుకు చెక్ పడిందా..? పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యూహం ఫలించిందా.. విడివిడిగా చేపట్టిన భేటీతో సమస్య కొలిక్కి వచ్చిందా అంటే.. అవుననే సమాధానం వస్తోంది. జేపీ నడ్డా రెబల్స్ బెడదకు చెక్ పెట్టినట్లు సమాచారం. పార్టీలో ప్రాధాన్యత లేదని కొద్ది రోజుల నుంచి.. పలువురు సీనియర్లు అలకబూనారు. అయితే ఎట్టకేలకు వారి సమస్యకు పరిష్కారం దొరికినట్లు తెలుస్తోంది.

JP Nadda Meets BJP Rebels In Telangana : కొద్ది రోజులుగా బీజేపీకు చెందిన పలువురు సీనియర్లు తమకు పార్టీలో ప్రాధాన్యత దక్కడంలేదని పార్టీ కార్యకలాపాల్లో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఇటీవల ప్రధాని మోదీ సభలకు, రాష్ట్ర పదాధికారుల సమావేశానికి సైతం.. వారు గైర్హాజరయ్యారు. తమ సమస్యలను పార్టీ హైకమాండ్‌కు చెప్పుకుని అక్కడే తేల్చుకుంటామని భావించారు. కాగా ఘట్‌కేసర్‌ వీబీఐటీలో నిర్వహించిన పార్టీ కౌన్సిల్ మీటింగ్‌కు హాజరై.. నడ్డాను కలవడం ఆసక్తికరంగా మారింది. విజయశాంతి, జి.వివేక్‌, రాజగోపాల్ రెడ్డితో నడ్డా.... విడివిడిగా భేటీ అయి పలు అంశాలపై చర్చించారని తెలుస్తోంది. దీంతో వారి మధ్య ఎలాంటి అంశాలు చర్చకి వచ్చాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

BJP Election Plan Telangana 2023 : 60 రోజులు.. 43 బహిరంగ సభలు.. జాతీయ నేతల ప్రసంగాలతో.. బీజేపీ మాస్టర్ ప్లాన్

పార్టీ అధ్యక్షుడి మార్పు, కవిత లిక్కర్ కేసు, బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న అంశంపై.. పార్టీ వైఖరి ఏంటనేది తమకు స్పష్టం చేయాలని, అలాగే తమకు ప్రాధాన్యత విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇంతకాలం క్రియాశీలకంగా లేనట్లు.. రెబెల్‌ నేతలు నడ్డాతో భేటీలో చెప్పినట్లు తెలుస్తోంది. కేసీఆర్ కుటుంబంపై పోరాటం విషయంలో ప్రధానంగా పట్టుబట్టినట్లు సమాచారం.

JP Nadda At Telangana BJP Council Meeting 2023 : ఇప్పటికి కూడా పార్టీ పాలసీ మారకుంటే... జనాల్లో చులకన భావం పెరుగుతుందని.. నడ్డాకు వివరించినట్లు తెలుస్తోంది. తిరుగుబాటు నేతల నుంచి విడివిడిగా భేటీ అయి వివరాలు తెలుసుకున్న నడ్డా.. వారికి ఎలాంటి హామీ ఇచ్చారనేది ఆసక్తికరంగా మారింది. తిరుగుబాటు నేతలకు ఎన్నికల కమిటీలో చోటు కల్పించి... వారిని శాంతపరిచారని జోరుగా ప్రచారం సాగుతోంది. కమిటీలో చోటు కల్పించడంతో వారు సైలెంట్ అయ్యారా.. లేక నడ్డా వారికి ఏమైనా హామీ ఇచ్చారా.. అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఎట్టకేలకు పార్టీ రాష్ట్ర కౌన్సిల్ మీటింగ్​తో... రెబల్స్ అంశం కొలిక్కివచ్చినట్లు సమాచారం.

JP Nadda Meets Ramoji Rao At RFC : రామోజీ రావును మర్యాదపూర్వకంగా కలిసిన జేపీ నడ్డా

Lack Of Unity in BJP in Telangana : కాగా ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పార్టీ నాయకుల మధ్య ఐక్యత లోపిస్తే అది ఎన్నికలపై ప్రభావం చూపుతుందని అధిష్టానం యోచిస్తోంది. పార్టీ నాయకుల మధ్య ఐక్యత కోసం కసరత్తులు చేస్తోంది. ఎన్నికల సమయానికి అందిరి నాయకుల మధ్య ఉన్న మనస్పర్థలను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు కారణంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న నాయకులతో జేపీ నడ్డా భేటీ అయ్యారు. ఒక్కొక్కరితో కలిసిన ఆయన పలు అంశాలపై చర్చలు జరిపారు. పార్టీ పాలసీ గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

Kishan Reddy Fires on Telangana Government : 'తెలంగాణలో ప్రభుత్వ భూములు, మద్యం అమ్మనిదే పాలన సాగే పరిస్థితి లేదు'

JP Nadda Fires on BRS : తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో.. కుటుంబ పాలన అంతం కావడం ఖాయం: జేపీ నడ్డా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.