సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బాపూజీనగర్, నేతాజీనగర్, ఆర్య సమాజ్, కంసరి బజార్ ప్రాంతాల్లో జేపీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు మూడు వేల మాస్కులు పంపిణీ చేశారు. నగరంలో కేసులో భారీగా పెరుగుతున్న ఈ పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ, వ్యక్తిగత శుభ్రత పాటించాలని అసోషియేషన్ అధ్యక్షుడు జంపన రవీందర్ కోరారు.
అనంతరం బోయిన్‌పల్లిలోని రెడ్‌క్రాస్ ఆస్పత్రిలో అకౌంటెంట్‌గా సేవలు అందించిన మనోరమ ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమెను శాలువతో సత్కరించారు.
ఇదీ చూడండి: కరోనాతో దేశంలో ఒక్కరోజే 507 మంది మృతి