BRS Leaders Join Congress : కాంగ్రెస్‌లో ఇప్పటికే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వారి అనుచర గణంతోపాటు ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు హస్తం పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు పలువురు నాయకులు చొరవ చూపుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది చేరేందుకు ఇప్పటికే సుముఖత వ్యక్తం చేయగా.. మరి కొందరు ఆచితూచి అడుగులు ముందుకు వేస్తున్నారు. రాహుల్‌గాంధీ అమెరికా నుంచి వచ్చిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో చేరికల హడావుడి ఊపందుకోనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Ponguleti Joins Congress : బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఒకరు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. నకిరేకల్ నుంచి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, గతంలో పోటీ చేసిన బీజేపీ ఉపాధ్యక్షురాలు.. హస్తం గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కీలక పదవిలో ఉన్న మెదక్ బీజేపీ నాయకుడు.. పార్టీలోకి వచ్చేందుకు చొరవ చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
BRS Leaders joins Congress Party : రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు బీఆర్ఎస్ జడ్పీ ఛైర్మన్లు.. కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వారంతా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. సత్తుపల్లి, పినపాక, భద్రాచలం నుంచి బీఆర్ఎస్ ముఖ్య నేతలు.. వైరా నుంచి సీపీఐ నాయకురాలు.. హస్తం వైపు మొగ్గుచూపుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు దీటుగా పోటీ చేసేందుకు ఉద్యోగ సంఘం నాయకుడిని రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ కార్యాచరణ రూపకల్పన చేసినట్లు సమాచారం.
Joinings in Telangana Congress : హైదరాబాద్‌లో అంబర్‌పేట్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో వివిధ పార్టీల నుంచి పోటీచేసిన నాయకులు, ఓ మాజీ మంత్రి కుమార్తె, తెలుగుదేశం మాజీ నాయకులు తదితరులు.. కాంగ్రెస్‌లో చేరేందుకు సమయం కోసం చూస్తున్నారని పార్టీ నేతలు స్పష్టం చేశారు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి పార్టీలోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. తన సోదరుడిని తీసుకొచ్చేందుకు రాయబారం నడువుతున్నట్లు తెలుస్తోంది. రాహుల్‌గాంధీ బహిరంగ సభ నాటికి కనీసం 20 మంది నాయకుల వరకు పార్టీలో చేర్పించే పనిని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి నేతృత్వంలో కోఆర్డినేషన్ కమిటీ.. చేరికలను విస్తృతం చేసే దిశలో ముందుకు వెళ్తుంది.
కమలం అనుకుంటే.. కాంగ్రెస్..! పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్కు దూరంగా ఉంటున్నప్పటి నుంచి ఎన్నో ప్రచారాలు జరిగాయి. కొత్త పార్టీ పెడతారని.. బీజేపీలో చేరే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపించాయి. బీజేపీ నేతలు పొంగులేటిని తమ గూటికి చేర్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నించారు. ఓ దశలో ఆయన కమలం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇటీవల కర్ణాటక ఫలితాలతో ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. ఆయనతో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కలిసి వచ్చే నేతలందరూ కలిసి ఒకేసారి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.
ఇవీ చదవండి: