- ఆ పుస్తకాలిష్టం
పెద్ద పుస్తకాల పురుగునేమీ కాదు కానీ, అప్పుడప్పుడూ చదువుతుంటా. చదివిన వాటిలో ‘హారీపోట్టర్’ సిరీస్ చాలా ఇష్టం. ఎప్పుడు చదివినా చాలా ఎంజాయ్ చేస్తుంటా.
- విభిన్నంగా చేయాలి
నాకంటూ ప్రత్యేకంగా డ్రీమ్ రోల్స్ ఏమీ లేవు. ఏం చేసినా విభిన్నంగా చేయాలి. ‘జెర్సీ’లో ఓ తల్లిలా సీరియస్ ఎమోషన్ ఉండే పాత్ర చేశా. ఇప్పుడు ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’లో సత్య పాత్రలో చాలా బోల్డ్‌గా కనిపించా. ఆ పాత్రలో నన్ను చూసి ప్రతిఒక్కరూ ఆమె శ్రద్ధేనా? అని ఆశ్చర్యపోయారు.
- స్ఫూర్తి
నయనతార, సమంత అంటే చాలా ఇష్టం. వాళ్లని స్ఫూర్తిగా తీసుకుంటా. వాళ్లు కథా నాయికల్లో సూపర్‌స్టార్స్. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే ఈ చిత్ర పరిశ్రమలో వాళ్లకి దీటుగా తమ సినిమాలతో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే సత్తా ఉన్న క్రౌడ్ పుల్లర్స్ వీళ్లు.
- నచ్చిన సినిమా..
నాకు బాగా నచ్చిన సినిమాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ప్రత్యేకంగా ఒకటి చెప్పాలంటే.. ‘లక్ష్య’. హృతిక్‌రోషన్, ప్రీతి జింటా జంటగా నటించారు. మా నాన్న ఆర్మీలో ఉన్నారు. అందుకే ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే చిత్రాలన్నీ చాలా నచ్చుతాయి.
- కొత్త సినిమాలు..
ప్రస్తుతం తెలుగు, తమిళ్‌లో హీరో విశాల్‌తో ‘చక్ర’ చిత్రం చేస్తున్నా. మాధవన్‌తో తమిళ్‌లో ‘మారా’ అనే సినిమా చెయ్యబోతున్నా. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.
- ప్రేమ పెళ్లే
పెద్దలు కుదిర్చిన పెళ్లికి వ్యతిరేకం కాదు కానీ, నేనైతే కచ్చితంగా ప్రేమ పెళ్లే చేసుకుంటా. మా ఇంట్లో దాదాపుగా అందరివీ ప్రేమ పెళ్లిళ్లే. మా అమ్మానాన్న కూడా నాకు ఆ స్వేచ్ఛనిచ్చారు. ప్రస్తుతానికైతే సింగిలే.
- నాని..
చాలా సపోర్టింగ్ కో-యాక్టర్. నటన పట్ల ఎంతో నిబద్ధతతో ఉంటారు. చిత్ర పరిశ్రమలోని ప్రతి విభాగంపైనా మంచి పట్టు ఉంది.
- ఇలాగే ఉంటా..
నిజ జీవితంలో నేను చాలా బోల్డ్. అంటే స్మోక్ చేయడం, మందు తాగడం కాదు. సొంత కాళ్లపై నిలబడగలగడం, నన్ను నేను నిరూపించుకోగ లగడం. ఎంత పెద్ద బాధ్యత నైనా ధైర్యంగా స్వీకరించడం.. ఇదీ బోల్డ్‌గా ఉండటమంటే.
- బలం.. బలహీనతలు
నా కుటుంబమే నా బలం. నేను ఆర్మీ కుటుంబంలో పుట్టి పెరిగినా అప్పుడప్పుడూ కొన్ని పనులు చెయ్యడానికి బద్ధకిస్తుంటా. అదే నా బలహీనత.
- మెచ్చే దుస్తులు..
ప్రత్యేకంగా చీరలే కట్టుకోవాలి, జీన్స్ మాత్రమే ధరించాలి అని అనుకోను. చేతిలో డబ్బులుంటే ఎక్కువగా షాపింగ్ చేస్తా. మనసుకు నచ్చిన దుస్తులు కొనుక్కుంటా. నా బీరువాలో చాలా రకాల బట్టలున్నాయి.
- ఇదీ చూడండి: ఆయోధ్యలో రామాలయ నిర్మాణం అప్పుడే!