ETV Bharat / state

IT Raids on Producer Abhishek Agarwal office Hyderabad : రవితేజ సినిమా నిర్మాత ఆఫీస్​లో ఐటీ సోదాలు - టాలీవుడ్‌లో ఐటీ సోదాలు

IT Raids on Producer Abhishek Agarwal office Hyderabad : టాలీవుడ్​లో మరోసారి ఐటీ సోదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా నిర్మాత అభిషేక్ ఆఫీస్​లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపుల విషయంలో బెంగళూరు బృందంతో కలిసి రాష్ట్ర ఐటీ అధికారులు​ అభిషేక్ కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.

Abhishek Agarwal office
It Raids
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2023, 3:07 PM IST

Updated : Oct 11, 2023, 3:38 PM IST

IT Raids on Producer Abhishek Agarwal Office Hyderabad : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరోసారి ఐటీ సోదాలు(It Raids) కలకలం రేపుతున్నాయి. రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు మూవీ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్(Abhishek Agarwal) ఆఫీసులో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపుల విషయంలో బెంగళూరు బృందంతో కలిసి రాష్ట్ర ఐటీ అధికారులు హైదరాబాద్​లోని​ అభిషేక్ కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫిల్మ్​ నగర్​లోని కార్యాలయానికి ఈ ఉదయం చేరుకున్న ఐటీ బృందాలు.. రికార్డులను సమగ్రంగా తనిఖీ చేస్తున్నాయి.

IT Raid in Tollywood : వ్యాపార రంగం నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టి కోట్లాది రూపాయల బడ్జెట్​తో పాన్ ఇండియా స్థాయిలో అభిషేక్ అగర్వాల్ సినిమాలను నిర్మిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ(Abhishek Agarwal Arts Production Company) పేరుతో నిర్మిస్తున్న చిత్రాల ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కార్తికేయ2, కాశ్మీర్ ఫైల్స్, వాక్సిన్ వార్ చిత్రాలు నిర్మాతగా, సహా నిర్మాతగా అభిషేక్ అగర్వాల్​కు మంచి లాభాలు తీసుకొచ్చాయి. అలాగే రవితేజతో టైగర్ నాగేశ్వర్​రావు చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. పాన్ ఇండియా స్థాయిలో అక్టోబర్ 20న ఈ చిత్రం విడుదల కాబోతున్న వేళ.. ఐటీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.

IT Raids in Hyderabad : హైదరాబాద్‌లో మరోసారి ఐటీ సోదాల కలకలం

IT Raids on Producer Abhishek Agarwal Office : మరోవైపు మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)ను హైదరాబాద్​లో అభిషేక్ అగర్వాల్ కలుసుకున్నారు. అమిత్ షాను కలిసి 24 గంటలు కాకముందే అభిషేక్ అగర్వాల్ నివాసం, కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరగడం గమనార్హం. అయితే ఐటీ అధికారుల తనిఖీలపై అభిషేక్ అగర్వాల్​తో పాటు ఆయన నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి వివరణ బయటికి రాలేదు. కాగా.. టాలీవుడ్‌లో ఇటీవల ఐటీ సోదాలు సంచలనంగా మారుతున్నాయి.

IT Raids in Mythri Movie Makers Office : గత ఏప్రిల్​లో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అనతి కాలంలోనే అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగి భారీ బడ్జెట్ చిత్రాలు(Big Budget Films) నిర్మిస్తోన్న మైత్రీ మూవీ మేకర్స్ లావాదేవీలపై ఆదాయపన్ను శాఖ తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆర్థిక లావాదేవీలు, ఆదాయపన్ను చెల్లింపుల విషయంలో ఈ సంస్థ అవకతవకలకు పాల్పడుతుందన్న సమాచారంతో కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ.. ఐటీ అధికారులు జూబ్లీహిల్స్​లోని మైత్రీ మూవీ కార్యాలయంలో ఐటీ తనిఖీలు నిర్వహించింది.

IT Raids in Hyd: 'పుష్ప' మూవీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కార్యాలయాల్లో ఐటీ దాడులు

రాష్ట్రవ్యాప్తంగా ఐటీ దాడులు.. ఏకకాలంలో 40 చోట్ల తనిఖీలు

Last Updated : Oct 11, 2023, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.