IPS Transfers in Hyderabad : రాష్ట్రంలో 9మంది ఐపీఎస్‌లు, ఐదుగురు నాన్ కేడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం(Telangana Govt) ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ ఎస్బీ జాయింట్ సీపీగా ఉన్న విశ్వప్రసాద్‌ను ట్రాఫిక్ అదనపు సీపీగా నియమించింది. హైదరాబాద్ సిట్, క్రైమ్స్ జాయింట్ సీపీగా ఏవీ రంగనాథ్‌ను నియమించింది. పశ్చిమ మండల డీసీపీగా ఎస్‌ఎం విజయ్ కుమార్‌ను నియమించి ఆ స్థానంలో ఉన్న జోయల్ డేవిస్‌ను హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా నియమించింది.
సైబరాబాద్ పరిధిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు
IPS Transfers in Telangana : ఉత్తర మండల డీసీపీగా రోహిణి ప్రియదర్శిని నియమించిన ప్రభుత్వం, ఆ స్థానంలో ఉన్న చందనా దీప్తిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. హైదరాబాద్ డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ డీసీపీగా ఎన్. శ్వేత, హైదరాబాద్ ట్రాఫిక్-1 డీసీపీగా ఎస్.సుబ్బరాయుడులను నియమించింది. ప్రస్తుతం ట్రాస్క్‌ఫోర్స్ డీసీపీగా ఉన్న నితిక పంత్, సీసీఎస్ జాయింట్ సీపీగా ఉన్న గజరావ్ భూపాల్‌ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సీఎస్ శాంతి కుమారి(CS Shanthi kumari) ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ నియామకాలు జారీ
దీంతో పాటు రాష్ట్రంలో మరో ఐదుగురు నాన్ క్యాడర్ ఎస్పీల బదిలీ చేస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-3గా ఎన్ వెంకటేశ్వర్లు నియమించి ఆ స్థానంలో ఉన్న డీ శ్రీనివాస్‌ను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేసింది. రాచకొండ రోడ్ సేఫ్టీ డీసీపీగా ఉన్న శ్రీ బాలా దేవిని బదిలీ చేసి హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా నియమించింది. ప్రస్తుతం మాదాపూర్ డీసీపీగా ఉన్న గోనె సందీప్‌ను రైల్వే ఎస్పీ అడ్మిన్‌గా నియమించింది. ఆ స్థానంలో ఉన్న రాఘవేందర్ రెడ్డిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఐపీఎస్ | బదిలీ స్థానం |
విశ్వప్రసాద్ | ట్రాఫిక్ అదనపు సీపీ |
ఏవీ రంగనాథ్ | హైదరాబాద్ సిట్, క్రైమ్స్ జాయింట్ సీపీ |
ఎస్‌ఎం విజయ్ కుమార్ | పశ్చిమ మండల డీసీపీ |
జోయల్ డేవిస్ | హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ డీసీపీ |
రోహిణి ప్రియదర్శిని | ఉత్తర మండల డీసీపీ |
ఎన్. శ్వేత | హైదరాబాద్ డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ డీసీపీ |
ఎస్.సుబ్బరాయుడు | హైదరాబాద్ ట్రాఫిక్-1 డీసీపీ |
చందనా దీప్తి | డీజీపీ కార్యాలయానికి అటాచ్ |
నితిక పంత్ | డీజీపీ కార్యాలయానికి అటాచ్ |
గజరావ్ భూపాల్ | డీజీపీ కార్యాలయానికి అటాచ్ |
నాన్ కేడర్ ఆఫీసర్ | బదిలీ స్థానం |
ఎన్ వెంకటేశ్వర్లు | హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-3 |
శ్రీ బాలా దేవి | హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ |
గోనె సందీప్ | రైల్వే ఎస్పీ అడ్మిన్ |
డీ. శ్రీనివాస్ | డీజీపీ కార్యాలయానికి అటాచ్ |
రాఘవేందర్ రెడ్డి | డీజీపీ కార్యాలయానికి అటాచ్ |
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు - ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శ్రుతి ఓజా