జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న 131 మంది ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. పాసింగ్ ఔట్ పరేడ్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ఐపీఎస్‌లకు ప్రధాని మోదీ స్ఫూర్తి సందేశం ఇవ్వనున్నారు.
పరేడ్‌లో పాల్గొన్న వారిలో 121 మంది 2018 బ్యాచ్ వారు కాగా, పది మంది 2017 బ్యాచ్‌కు చెందినవారు. తమిళనాడు కేడర్‌కు చెందిన కిరణ్ శృతి నాయకత్వం వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబేషనర్లలో ముగ్గురు మహిళలతో సహా 11 మంది ప్రొబేషనర్లను తెలంగాణాకు, అయిదుగురిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు.
ట్రైనింగ్ సమయంలో అత్యంత ప్రతిభ కనబరచిన తమిళనాడు కేడర్‌కు చెందిన కిరణ్ శృతి ప్రధాన మంత్రి బ్యాటన్, హోం మంత్రి రివాల్వర్ అందుకోనున్నారు. కొవిడ్ కారణంగా ఈ కార్యక్రమనికి బయటివారిని అనుమతించ లేదు.