రాష్ట్రంలో ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్‌ను తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ తిరిగి ప్రారంభించింది. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఆవిష్కర్తలను ఆన్లైన్లో ప్రదర్శించవచ్చని ప్రకటించింది.
తమ ఆవిష్కరణకు సంబంధించిన ఆరు వాక్యాలు, రెండు నిమిషాల వీడియోను, ఆవిష్కరణకు సంబంధించిన నాలుగు ఫోటోలు, ఆవిష్కర్త వివరాలను 9100678543 నెంబర్‌కు పంపించి నమోదు చేసుకోవాలని తెలిపింది.