ETV Bharat / state

internal disputes in congress : రాష్ట్ర కాంగ్రెస్​లో నేతల మధ్య కొరవడిన సఖ్యత..! - internal disputes in congress

internal disputes in congress : కాంగ్రెస్‌ పార్టీలో.. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ.. నేతల మధ్య సఖ్యత లేకపోవడం.. తరచూ వివాదాస్పదం కావడం.. ఆ తర్వాత.. ఇలాంటి ప్రకటనలే చేయడం పరిపాటి.. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరు పగ్గాలు చేపట్టినా పార్టీ బలోపేతం కంటే... ఈ సమస్యలే ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి పరిస్థితి ఇదే విధంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల గాంధీభవన్‌ వేదికగా నాయకులు చేస్తున్న ప్రకటనలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

CONGRESS
CONGRESS
author img

By

Published : Jan 6, 2022, 2:14 PM IST

internal disputes in congress : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ల మధ్య అంతర్గత విబేధాలు ముదిరి పాకానపడుతున్నాయి. సీనియర్లలో సఖ్యత లేకపోవడం శ్రేణుల్లో నైరాశ్యానికి దారితీస్తోంది. కొత్త ఏడాదిలోనైనా అసంతృప్తి స్వరాల తీరు మారాలంటూ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ చిన్నారెడ్డి విజ్ఞప్తి చేసినా.. పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. రేవంత్‌రెడ్డి తీరును ముందు నుంచీ తప్పుపడుతున్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. సోనియాకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాయడం .. విషయం బయటకు వెల్లడి కావడం కలకలం రేపింది. తనను తప్పుపట్టడంతో పాటు కాంగ్రెస్‌ పార్టీలో నిబద్ధత కలిగిన నేతలపైనా వ్యవహరిస్తున్న తీరుపై జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలోంచి పంపించే కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల్లోకి వెళ్తే తలెత్తుకోలేక పోతున్నాం

కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై లింగోజిగూడ కార్పొరేటర్‌ రాజశేఖర్‌రెడ్డి గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టిమరీ ఐక్యంగా ఉండాలని సీనియర్లకు హితవు పలకడం పరిస్థితికి అద్దం పడుతోంది. 23 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను నాలుగు సార్లు పోటీ చేసి ఒకసారి గెలిచానని.. ప్రజల్లోకి వెళ్తే సీనియర్ల మధ్య విబేధాలతో తలెత్తుకోలేక పోతున్నామని గాంధీభవన్‌లో మీడియా ముందే వెల్లడించడం నేతలను ఆలోచనలో పడేస్తోంది.

ముందు నుంచి అదే చెబుతున్న వీహెచ్​..

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతర్గత విబేధాలు కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం అందరినీ కలుపుకొని వెళ్లాలని ముందునుంచి చెబుతున్న వీహెచ్​.. గొడవలు సద్ధుమణిగేలా తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసిన హన్మంతరావు.. ఇవాళ జగ్గారెడ్డితో భేటీ అవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

తొందర పడొద్దు...

పార్టీలో అంతర్గత విబేధాలే నిన్న జరిగిన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చాయి. జూమ్ యాప్‌లో 4 గంటలపాటు సమావేశం జరగ్గా.. కోమటిరెడ్డి సోదరులు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గైర్హాజరయ్యారు. వాడీవేడిగా సాగిన కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో.. రేవంత్‌రెడ్డి వైఖరిపట్ల పలువురు పీఏసీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ రేవంత్‌రెడ్డిని మందలించినట్లు తెలిసింది. అందరికీ అందుబాటులో ఉండాలని సూచించినట్లు సమాచారం.

వారిపై త్వరలో వేటు..!

తనను కోవర్టుగా చిత్రీకరించారని జగ్గారెడ్డి ఫిర్యాదు చేశారు. పార్టీలో ఉండదలచుకోలేదని చెప్పగా.. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని శ్రీధర్‌బాబు, జానారెడ్డి సర్దిచెప్పారు. క్రమశిక్షణ కమిటీ తీరుపై పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి, వీహెచ్​ అసంతృప్తి తెలిపారు. సభ్యత్వం సరిగా జరగట్లేదని మాణికం ఠాగూర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యత్వ ప్రక్రియ వేగవంతం చేయాలని స్పష్టం చేసిన మాణికం ఠాగూర్‌.. సక్రమంగా పనిచేయని డీసీసీలపై పీసీసీ నివేదిక కోరారు. చురుగ్గా పనిచేయని పార్టీ జిల్లా అధ్యక్షులపై త్వరలో వేటు వేసే అవకాశం ఉందని సమాచారం.

సీనియర్‌ నేతల మధ్య అనైక్యత కాంగ్రెస్‌ పార్టీలో ప్రధాన సమస్యగా మారిందని కార్యకర్తల నుంచి అధిష్ఠానం వరకు ఒకే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న తరుణంలో ఇంటిగోల ఎప్పటికి గాడిన పడుతుందోనేది శ్రేణులకు అంతుపట్టడం లేదు.

ఇదీ చూడండి: TPCC PAC Meeting : వాడీవేడిగా పీఏసీ మీటింగ్​.. రేవంత్​ తీరుపై సీనియర్ల అసహనం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.