మార్చి 4 నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఇంటర్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 1339 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు అధికారులు. ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో హాల్ టిక్కెట్లు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. నేటి అర్ధరాత్రి నుంచి కళాశాలలు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.
విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు. హాల్ టికెట్లపై ఎవరి సంతకం అవసరం లేదని స్పష్టం చేశారు. ఏమైనా సమస్యలుంటే బిగ్ఆర్ఎస్తో పాటు కంట్రోల్ రూమ్ నంబర్ 040-24600110 కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.
పరీక్ష కేంద్రాలు తెలుసుకునేందుకు మొబైల్ యాప్ రూపొందించిన్నట్లు చెప్పారు. ప్లేస్టోర్‌లో టీఎస్‌బీఐఈ ఎం-సర్వీసెస్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. ఉదయం 9గంటల తర్వాత ఎట్టిపరిస్థితుల్లో అనుమతించం అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఆ వాట్సాప్ గ్రూపుల్లోనే దిల్లీ అల్లర్లకు స్కెచ్