ETV Bharat / state

ఇంటర్ పరీక్షకు 27 మంది విద్యార్థులు గైర్హాజరు - inter exams

ఇంటర్ ద్వితీయ సంవత్సరం జాగ్రఫీ పరీక్షకు భౌతిక దూరం పాటిస్తూ విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వచ్చారు. శరీర ఉష్ణోగ్రతలు పరీక్షించిన తర్వాతనే పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించారు.

inter second year exams starts from today in lock down time
నేటి ఇంటర్ పరీక్షకు 27 మంది విద్యార్థులు గైర్హాజరు
author img

By

Published : Jun 3, 2020, 3:37 PM IST

లాక్‌డౌన్‌ వల్ల ఆగిపోయిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం జాగ్రఫీ పరీక్ష నేడు నిర్వహించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం జాగ్రఫీ, మోడ్రన్ లాంగ్వెజెస్ పరీక్షకు 834 మంది హాజరయ్యారు. 27 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.

విద్యార్థులు మాస్క్‌లు ధరించి పరీక్ష కేంద్రాలకు వచ్చారు. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత... శరీర ఉష్ణోగ్రత పరీక్షించాకే అధికారులు లోపలికి అనుమతించారు. కరోనా పరిస్థితులు, రవాణా సదుపాయం లేకపోవడం వంటి ఏదైనా కారణాలతో పరీక్షకు హాజరు కాలేకపోతే.. జులై రెండో వారంలో జరగనున్న అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షకు హాజరు కావచ్చునని ఇంటర్‌ బోర్డు తెలిపింది. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారిని కూడా.. రెగ్యులర్ విద్యార్థులుగానే గుర్తిస్తామని పేర్కొంది.

ఇవీ చూడండి: మే నెల ఆదాయానికి కలిసిరాని లాక్​డౌన్ సడలింపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.