హైదరాబాద్ రహమత్‌నగర్‌లోని ఎమ్ఎస్‌ఎమ్‌ఈలో ప్రకృతి ఇన్విరాన్‌మెంట్ సొసైటీ, జన వికాస సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఒక జిల్లా -ఒక ఉత్పత్తిపై కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా - ఒక ఉత్పత్తి కార్యక్రమం విజయవంతమైందని.. తెలంగాణలో కూడా దీనిని అమలు చేయాలని సూచించారు.
3లక్షల ఉద్యోగాలు ఖాళీ
తెలంగాణలో ఉపాధి కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాలకు తరలివచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. ప్రభుత్వం భర్తీ చేయడం లేదని మండిపడ్డారు.
సర్కార్ వద్ద సరైన ప్రణాళిక లేదు..
రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు కుంటుపడ్డాయని మాజీ ఐఏఎస్ చంద్రవదన్ వ్యాఖ్యానించారు. చిన్నతరహా, కుటీర పరిశ్రమల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళికలు లేవని విమర్శించారు.
ఇదీ చూడండి : 'బ్యాంకు సేవల్లో లోపానికి పరిహారం చెల్లించాలన్న వినియోగదారుల ఫోరం'