హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిరుద్యోగ కళాకారులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర పోషించిన తమకు ఉద్యోగాలు ఇవ్వకుండా మొండి చేయి చూపించారని కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ ద్వారా అర్హులకు ఉద్యోగాలివ్వాలని హైకోర్టు తీర్పు వచ్చి 9 నెలలు గడిచినా నియామకాల ఊసే లేదన్నారు.
అర్హులైన నిరుద్యోగ కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక శాఖలో వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పును తెలంగాణ సాంస్కృతిక శాఖ ధిక్కరించిందన్నారు. ఆట పాటలే ఆయుధంగా పోరాడిన కళాకారులను ఇప్పటికైనా గుర్తించాలని కోరారు. ఉద్యోగ నియమకాలపై నిర్లక్ష్యం వహిస్తే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని తెలంగాణ నిరుద్యోగ కళాకారుల సమాఖ్య హెచ్చరించింది.
'పేద, నిరుద్యోగ కళాకారులకు కొలువులివ్వకుంటే మరో ఉద్యమమే' - నిరుద్యోగ కళాకారులు ధర్నా
కాలికి గజ్జె కట్టి, డప్పు దరువులతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తమకు ఉద్యోగాలివ్వకుంటే ఎలా బతకాలని తెలంగాణ నిరుద్యోగ కళాకారుల సమాఖ్య మండిపడింది.
హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిరుద్యోగ కళాకారులు ధర్నా నిర్వహించారు. రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర పోషించిన తమకు ఉద్యోగాలు ఇవ్వకుండా మొండి చేయి చూపించారని కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ ద్వారా అర్హులకు ఉద్యోగాలివ్వాలని హైకోర్టు తీర్పు వచ్చి 9 నెలలు గడిచినా నియామకాల ఊసే లేదన్నారు.
అర్హులైన నిరుద్యోగ కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక శాఖలో వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పును తెలంగాణ సాంస్కృతిక శాఖ ధిక్కరించిందన్నారు. ఆట పాటలే ఆయుధంగా పోరాడిన కళాకారులను ఇప్పటికైనా గుర్తించాలని కోరారు. ఉద్యోగ నియమకాలపై నిర్లక్ష్యం వహిస్తే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని తెలంగాణ నిరుద్యోగ కళాకారుల సమాఖ్య హెచ్చరించింది.
vyas
Conclusion: