హైదరాబాద్లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 63 మంది మందుబాబులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 35 కార్లు, 28 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కొందరు వాహనదారులు తప్పించుకునేందుకు ప్రయత్నించగా... పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పట్టుబడిన మందుబాబులకు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరుచనున్నట్లు పోలీసులు తెలిపారు.
- ఇదీ చూడండి : సంక్షోభం అంచున కర్ణాటక సంకీర్ణ సర్కార్