ఇప్పటికే చాలా ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ యూనివర్సిటీలు డిజిటల్ బోధనకు తెరతీశాయి. ఇక చాలా పాఠశాలలు ఆన్లైన్ క్లాస్‌లకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ తరుణంలో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 7, 8, 9, 10 తరగతుల విద్యార్థుల కోసం ఆన్లైన్ గణిత క్లాసులు నిర్వహిస్తున్నట్లు ట్రస్టు కార్యదర్శి వినయ్ కుమార్ వెల్లడించారు.
ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రతిరోజు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 100 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటున్నట్లు తెలిపారు. 45 రోజులపాటు సాగే ఈ తరగతులను జయపద్రం చేయాలని కోరారు. ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలను ప్రజలందరూ పాటించాలని పేర్కొన్నారు.