హైదరాబాద్ సింగరేణి కాలనీలో సీపీఐ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. తమ బస్తీని సీఎం కేసీఆర్ సొంతూరైన చింతమడకగా మార్చాలంటూ గిరిజన సంప్రదాయం ప్రకారంగా మద్యం, మాంసాహారంతో సీఎం చిత్ర పటానికి సమర్పించారు. చింతమడక తరహాలో సింగరేణి కాలనీకి నిధులు మంజూరు చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర నేత శంకర్ నాయక్ ఆధ్వర్యంలో గిరిజనులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కేసీఆర్ చిత్రపటానికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గిరిజనులతోపాటు సీపీఐ నేతలు పాల్గొన్నారు.
ఇవీచూడండి: హైదరాబాద్లో కాళేశ్వరం ప్రాజెక్టు... వినాయక చవితి స్పెషల్