ETV Bharat / state

'పాత్రికేయుల సేవలు అభినందనీయం'

కరోనా కట్టడికై వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందితో పాటు జర్నలిస్టులు చేస్తున్న కృషి అభినందనీయమని లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రేటర్ బంజారా ప్రతినిధులు పేర్కొన్నారు. సామాజిక బాధ్యతతో ప్రభుత్వానికి చేయూతనిస్తూ కరోనా వైరస్‌పై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్న ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా పాత్రికేయులను సన్మానించారు.

author img

By

Published : May 17, 2020, 2:24 PM IST

Hyderabad Lions Club Members honoured to journalists at Gun park
'పాత్రికేయుల సేవలు అభినందనీయం'

లాక్​డౌన్ నేపథ్యంలో కరోనా వైరస్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విశేషమైన కృషి చేస్తున్న పాత్రీకేయులను లయన్స్​ క్లబ్​ సభ్యులు గన్​పార్క్ వద్ద ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులతో పాటు బుల్లితెర ఆర్టిస్టులు రామ్, జగన్, విజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

కరోనా వ్యాప్తి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వార్తా కథనాలను ప్రచురిస్తున్నారని కొనియాడారు. అన్నార్తుల ఆకలి తీర్చేందుకు గత 40 రోజులుగా భోజన ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు సభ్యులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.