ETV Bharat / state

అబ్దుల్ కరీం టుండాను నిర్దోషిగా తేల్చిన నాంపల్లి కోర్టు

author img

By

Published : Mar 3, 2020, 7:10 PM IST

Updated : Mar 3, 2020, 9:52 PM IST

abdul karim tunda
abdul karim tunda

19:07 March 03

అబ్దుల్ కరీం టుండాను నిర్దోషిగా తేల్చిన నాంపల్లి కోర్టు

అబ్దుల్ కరీం టుండాను నిర్దోషిగా తేల్చిన నాంపల్లి కోర్టు

 హైదరాబాద్​లో పేలుళ్లకు కుట్రపన్నిన కేసులో నిందితుడిగా ఉన్న అబ్దుల్ కరీం టుండాను నాంపల్లి న్యాయస్థానం నిర్దోషిగా తేల్చింది. ఈ కేసులో పోలీసులు సరైన ఆధారాలు సమర్పించకపోవడంతో న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. 1998లో పాకిస్థాన్​కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిదా దేశంలోని పలు చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నింది.  హైదరాబాద్​లోనూ హుమాయున్ నగర్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అబిడ్స్, ఎంజే మార్కెట్​లో పేలుళ్లకు కుట్ర పన్నారు.  

ఢాకాలో శిక్షణ

పాకిస్థాన్​కు చెందిన సలీం జునేద్ పేలుళ్ల కోసం నగరానికి వచ్చి మల్లేపల్లికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. అనంతరం హైదరాబాద్​తో పాటు... ముంబయిలోనూ పాస్​పోర్టు తీసుకున్నాడు. సలీం జునేద్​తో పాటు... నగరానికి చెందిన అబ్దుల్ ఖయూమ్ 1996లో ఢాకా వెళ్లి ఉగ్రశిక్షణ పొందారు. వీళ్లకు అబ్దుల్ కరీం టుండా... పేలుళ్లలో శిక్షణ ఇవ్వడంతో పాటు ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా ప్రోత్సహించాడు. సలీం జునేద్​తో పాటు... అబ్దుల్ ఖయూమ్ 1998లో నగరానికి చేరుకొని పేలుళ్లకు కుట్రపన్నారు.  

ఆధారాలు సమర్పించకపోవడంతో...  

ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న సలీం జునేద్​తో పాటు... మరో కొంతమందిని నాంపల్లి న్యాయస్థానం దోషులుగా తేల్చింది. పేలుళ్లకు కుట్రపన్నిన కేసులో నిందితుడిగా ఉన్న టుండా పాకిస్థాన్​లో తలదాచుకున్నాడు. 2013 ఆగస్టులో నేపాల్ సరిహద్దులో కరీం టుండా పట్టుబడిన తర్వాత... నగర పోలీసులు 2014లో కస్టడీలోకి తీసుకొని నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపర్చారు. ఆరేళ్ల పాటు న్యాయస్థానంలో విచారణ కొనసాగింది. టుండా ప్రమేయంపై సరైన ఆధారాలు సమర్పించకపోవడంతో న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. ఘజియాబాద్​లో పేలుళ్లకు కుట్రపన్నిన కేసులో టుండా ఘజియాబాద్ జైలులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు.  

Last Updated : Mar 3, 2020, 9:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.