ETV Bharat / state

రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షపాతం - వర్షాలు

రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కాలంలో మంచి వర్షపాతం నమోదయింది. వాతావరణ మార్పులతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ప్రకటించిన భారత వాతావరణ శాఖ.. అంచనాలకు భిన్నంగా అదనపు వర్షపాతం నమోదయింది. గత 33 ఏళ్లల్లో ఈ ఏడాది మాత్రమే 1078.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు బుధవారం నుంచి నైరుతి రుతుపవనాల ఉసంహరణ ప్రారంభమైంది.

heavy rainfall in this year  compare then last 33 years
రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షపాతం
author img

By

Published : Oct 2, 2020, 4:48 AM IST

ఈ ఏడాది దేశవ్యాప్తంగా మంచి వర్షాలు కురిశాయి. గత 33 ఏళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదయింది. ఎక్కువ రోజులపాటు వర్షం కురవడం కూడా ఈ ఏడాది ఒక రికార్డు. 1988-89 సంవత్సరం నైరుతి రుతుపవనాల సమయంలో 541.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. 64 రోజుల పాటు వర్షం పడింది. 8.5 మిల్లీమీటర్ల తీవ్రత నమోదైంది. 1989-90లో 832.90 మిల్లీమీటర్ల వర్షపాతంతో 67 రోజులు వాన కొట్టింది. తీవ్రత 12.4 మిల్లీమీటర్లుగా ఉంది.1990-91లో 653.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా 63 రోజులు వర్షం కురిసింది. 10.4 మిల్లీమీటర్ల తీవ్రత నమోదైంది.

2005-06లో నైరుతి రుతుపవనాల సమయంలో 808.2 మిల్లీమీటర్ల వర్షపాతంతో 67 రోజులు వర్షం పడింది. తీవ్రత 8.8 మిల్లీమీటర్లుగా ఉంది. 2010-11 సంవత్సరంలో 894.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఏకంగా 81 రోజుల పాటు వర్షం పడగా... 11.0 మిల్లీమీటర్ల తీవ్రత నమోదైంది. మరుసటి ఏడాదికొచ్చేసరికి 601.2 మిల్లీమీటర్ల వర్షపాతంతో 65 రోజులు మాత్రమే వర్షం పడింది. తీవ్రత 9.2 మిల్లీమీటర్లుగా ఉంది.

రుతుపవనాల ఉపసంహరణ

2013-14లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత 71 రోజుల్లో 851.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. 2016-17లో 912.2 మిల్లీమీటర్ల వర్షపాతం 73 రోజుల్లో కురిసింది. 2019-20లో 77 రోజుల్లో 791.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక 2020-21లో 1078.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఏకంగా 82 రోజులు వర్షం పడింది. 13.2 మిల్లీమీటర్ల తీవ్రత నమోదవడం విశేషం. తెలంగాణలో బుధవారం నుంచి నైరుతి రుతుపవనాలు ఉపసంహరణ ప్రారంభమైంది. పశ్చిమ హిమాలయ ప్రాంతం, హర్యానా, చండీఘర్, దిల్లీ నుంచి పూర్తిగా..పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తర్​ప్రదేశ్​లోని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు వెనక్కు మళ్లాయి.

ఇదీ చదవండి: కాజీపేట-బళ్లార్ష సెక్షన్​లో రైళ్ల దారి మళ్లింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.