ETV Bharat / state

Hyderabad rain: అలర్ట్​ హైదరాబాద్‌... 6- 8 గంటల పాటు ఇళ్లల్లోనే ఉండండి

author img

By

Published : Sep 6, 2021, 4:33 PM IST

Updated : Sep 6, 2021, 8:22 PM IST

Hyderabad rains
Hyderabad rains

16:32 September 06

అలర్ట్​ హైదరాబాద్‌... 6- 8 గంటల పాటు ఇళ్లల్లోనే ఉండండి

రెండు మూడ్రోజులుగా భాగ్యనగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు జలమయమయ్యాయి. వివిధ పనుల కోసం బయటకి వచ్చినవారు తడిసి ముద్దవుతున్నారు. రహదారులపైకి వరద నీరు రావడంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల మోకాలి వరకు వరద పోటెత్తింది. జీహెచ్​ఎంసీ ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి పలుచోట్ల రోడ్లపై నిలిచిన నీటిని తొలగిస్తున్నారు. మరో రెండ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో... లోతట్టు కాలనీవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్​ఎంసీ హెచ్చరికలు జారీచేసింది. 6- 8 గంటల పాటు ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. సహాయం కోసం నం. 040- 2955 5500 సంప్రదించాలని ​తెలిపారు.

ఇదీ చూడండి: HEAVY RAINS IN TELANGANA: ఏకధాటి వర్షాలు.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు.. అవస్థల్లో ప్రజలు

Last Updated : Sep 6, 2021, 8:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.