ETV Bharat / state

ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌కు డబ్బులడిగిన డాక్టర్.. అక్కడికక్కడే సస్పెండ్ చేసిన హరీశ్ - డాక్టర్‌ను సస్పెండ్ చేసిన హరీశ్ రావు

Minister Harish Rao: పేదలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందేలా చూడటమే తమ ఉద్దేశమన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న వైద్యులు, సిబ్బందిపై అప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఆకస్మిక తనిఖీలు చేస్తూ.. నిర్లక్ష్యంగా ఉన్న వారిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. తాజాగా.. డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ కావాలని హైదరాబాద్ కొండాపూర్ ఏరియా ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తిని డబ్బులు డిమాండ్ చేసిన వైద్యుణ్ని మంత్రి హరీశ్ రావు సస్పెండ్ చేశారు.

Minister Harish Rao
Minister Harish Rao
author img

By

Published : May 23, 2022, 2:16 PM IST

Harish Rao Suspended a Doctor : హైదరాబాద్‌ కొండాపూర్ ఏరియా ఆస్పత్రి వైద్యుడిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సస్పెన్షన్‌ వేటు వేశారు. ఆ ఏరియా ఆస్పత్రిని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేసేందుకు వచ్చారు. ఇదే సమయంలో డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ కావాలని వచ్చిన తమని ఆస్పత్రి వైద్యుడు మూర్తి డబ్బులు అడిగారని బాధితులు ఫిర్యాదు చేశారు.

ఘటనకు సంబంధించి అప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు.... తక్షణం వైద్యుడిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యులను హెచ్చరించారు. ఆస్పత్రిలో వివిధ వార్డులను పరిశీలించిన మంత్రి సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. గైనకాలజీ విభాగంలో నిత్యం స్కానింగ్‌లు నిర్వహించాలన్న ఆయన అవసరమైన ఆల్ట్రా సౌండ్ యంత్రాలను అందిస్తామని హామీ ఇచ్చారు. 60 శాతానికి పైగా సాధారణ డెలివరీలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంఖ్యను మరింత పెంచాలని సిబ్బందికి సూచించారు.

ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌కు డబ్బులడిగిన డాక్టర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.