ETV Bharat / state

GST: జీఎస్టీ వసూళ్లు..సెప్టెంబరులో 25శాతం పైగా వృద్ధి - september gst collections in ap

ఇరు తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబరు నెల జీఎస్టీ(GST) గణాంకాలు విడుదలయ్యాయి. తెలంగాణలో 25శాతం, ఆంధ్రప్రదేశ్​లో 21శాతం చొప్పున జీఎస్టీ వసూళ్లు పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

gst
జీఎస్టీ
author img

By

Published : Oct 2, 2021, 1:12 PM IST

సెప్టెంబరు నెలలో రాష్ట్రంలో జీఎస్టీ(GST) వసూళ్లు 25శాతం వృద్ధి చెందినట్లు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. గత నెలలో తెలంగాణకు సంబంధించి జీఎస్టీ(GST) ఆదాయం రూ.1,17,010 కోట్లుగా నమోదైనట్లు తెలిపింది. ఇందులో సీజీఎస్టీ(CGST) కింద రూ.20,578 కోట్లు, ఎస్​జీఎస్టీ(SGST) రూ.26,767 కోట్లు, ఐజీఎస్టీ(IGST) రూ.60,911 కోట్లు వసూలైనట్లు వెల్లడించింది. ఐజీఎస్టీ(IGST) నుంచి సీజీఎస్టీ(CGST) కింద రూ.28,812 కోట్లు, ఎస్​జీఎస్టీ(SGST) కింద రూ. 24,140 కోట్లు చొప్పున సర్దుబాటు చేసింది.

రెగ్యులర్ సెటిల్‌మెంట్ల తర్వాత కేంద్ర ఆదాయం కింద సీజీఎస్టీ(CGST) రూ.49,390 కోట్లు, రాష్ట్ర ఆదాయం కింద ఎస్​జీఎస్టీ(SGST) రూ.50,907 కోట్లు వసూళ్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో వచ్చిన జీఎస్టీ(GST) రాబడులను బేరీజు వేస్తే 23 శాతం అధికంగా వచ్చినట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో గతేడాది సెప్టెంబరు​లో రూ.2,796 కోట్లు రాగా ఈ సెప్టెంబరులో రూ.3,494 కోట్లు ఆదాయం వచ్చింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్​లో కూడా జీఎస్టీ(GST) వసూళ్లు 21 శాతం వృద్ధి చెందాయి. గత ఏడాది సెప్టెంబరులో రూ.2,141 కోట్లు రాగా ఈ ఏడాది రూ. 2,595 కోట్లు వచ్చినట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: Gandhi Jayanti: బాపూఘాట్‌లో గాంధీ జయంతి వేడుకలు.. నివాళి అర్పించిన గవర్నర్‌, స్పీకర్‌, మంత్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.