రాజ్‌భవన్‌లో 30 రోజుల సమ్రాక్షన-క్షమతా మహోత్సవ్(సాక్షం-2021)ను గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. చమురు పరిశ్రమ కోసం రాష్ట్ర స్థాయిలో సమన్వయ సమావేశం నిర్వహించారు. సహజ వనరులను విచక్షణా రహితంగా ఉపయోగించడం వల్ల భూతాపం అధికంగా పెరుగుతుందని తమిళిసై అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ ఆత్మ నిర్భర భారత్ దృష్టి ప్రకారం మనమంతా ఇంధన రంగంలో స్వావలంబన పొందాలన్నారు. మనందరం ఇంధన శక్తి పరిరక్షణలో భాగం కావాలని కోరారు. ఈ సమావేశంలో జె.ఎం.నాయక్, శ్రావణ్, ఎస్.రావు(ఐఓసీ), నరసింహ, సీకే (హెచ్‌పీసీఎల్), సైబల్ ముఖర్జీ (బీపీసీఎల్), సంజయ్ షిండే(గెయిల్-ఇండియా), పెట్రోలియం పరిరక్షణ పరిశోధన సంఘం నాయకులు హరి కేలోతు, వివిధ చమురు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి: సీఎస్