జీహెచ్‌ఎంసి స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు 15 మంది సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. గురువారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. స్టాండింగ్ కమిటీ ఎన్నిక కోసం ఈ నెల 5న నోటిఫికేషన్ రాగా... 10 నుంచి 18 తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఎన్నికల అధికారులు నామినేషన్ల స్క్రూటిని చేయనున్నారు. ఈ నెల 23వ తేది సాయంత్రం 3గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు చేసుకునే అవకాశం ఉంది.
అనంతరం తుది జాబితా ప్రకటన చేయనున్నారు. ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఆ రోజే కౌంటింగ్ చేయనున్నారు. ఇందులో15 మంది సభ్యులను స్టాండింగ్ కమిటీకి ఎన్నుకోనున్నారు. 15 మందే నామినేషన్ వేయడం వల్ల స్క్రూటినిలో ఎవరిని తొలగించకుంటే... ఎన్నికలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది.
ఇవీ చూడండి: మెడికల్, డెంటల్ పరీక్షల నిర్వాహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్