జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. 15 మంది నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని జీహెచ్ఎంసీ ప్రకటించింది. అనంతరం అధికారులు తుది జాబితా ప్రకటించారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందని తెలిపారు.
ఈ నెల 29వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో పోలింగ్ నిర్వహించననున్నారు. 15 మంది అభ్యర్థులు పోటీలో ఉండడం వల్ల ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.
ఇవీ చూడండి: ఎమ్మెల్యే రాజాసింగ్ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్