ETV Bharat / state

16 తీర్మానాలకు జీహెచ్​ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం - GHMC_STANDING_COMMITE_MEETING

నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జీహెచ్​ఎంసీ స్టాండింగ్​ కమిటీలో 16 తీర్మానాలకు ఆమోదం తెలిపారు.

16 తీర్మానాలకు ఆమోదం తెలిపిన జీహెచ్​ఎంసీ స్టాండింగ్ కమిటీ
author img

By

Published : Sep 27, 2019, 5:35 AM IST

జీహెచ్​ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 16 తీర్మానాలకు ఆమోదం తెలిపారు. ప్రధానంగా 48 కమ్యూనిటీ హాళ్లలో 500 చదరపు అడుగుల స్థల విస్తీర్ణంలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసేందుకు అనుమతినిస్తూ తీర్మానం చేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు క్రీడా అంశాల శిక్షణకు చెల్లిస్తున్న యూజర్ ఛార్జీల పునర్ వ్యవస్థీకరణకు ఆమోదం తెలిపారు.

16 తీర్మానాలకు ఆమోదం తెలిపిన జీహెచ్​ఎంసీ స్టాండింగ్ కమిటీ
చందానగర్ రైల్వేస్టేషన్ నుంచి మంజీర పైప్ లైన్ వరకు 150 అడుగుల మేర రోడ్డు విస్తరణ ప్రతిపాదనలకు, శేరిలింగంపల్లి సర్కిల్​లోని మాధవి హిల్స్ నుంచి నార్నె రోడ్డు వరకు 36 ఫీట్ల మేర... బాలానగర్ వై జంక్షన్ వద్ద 60 మీటర్ల మేర.... దివ్యశ్రీ కాంప్లెక్స్ నుంచి నాగ హిల్స్ మీదుగా 18 మీటర్ల మేర రోడ్డు విస్తరణ ప్రతిపాదనలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. జీహెచ్​ఎంసీ పరిధిలో ఉన్న 135 మోడ్రన్ జిమ్​లను ఉపయోగించేవారు వెబ్​ పోర్టల్​ ద్వారా ఆన్ లైన్​లో సభ్యత్వం నమోదు చేసుకునే ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 687.31 కిలోమీటర్ల ప్రధాన రహదారులను వార్షిక నిర్వహణ పద్దతిలో ఏజెన్సీలకు అందించేందుకు రూపొందించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపే తీర్మానానికి స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.