మురికివాడల్లో నివసించేవారికి మెరుగైన సదుపాయాలు కల్పించాలనేది తమ ముఖ్య ఉద్దేశ్యమని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. బేగంపేటలోని రామానంద తీర్థ మెమోరియల్ మందిరంలో స్లమ్ లెవెల్ ఫెడరేషన్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్, అదనపు కమిషనర్ స్నిగ్ధ పట్నాయక్, జోనల్ కమిషనర్ రఘు ప్రసాద్ హాజరయ్యారు. జీహెచ్ఎంసీలో అద్దె వాహనాలను ఇకనుంచి ఎస్ఎల్ఎఫ్ సంఘాల ద్వారా తీసుకునేందుకు నిర్ణయించామని తెలిపారు. సుమారు వంద సంఘాలకు ఒక్కక్కరికి రూ. 25 లక్షల చొప్పున రుణాలు ఇప్పిస్తామని పేర్కొన్నారు.
సాఫ్ హైదరాబాద్ షాన్ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా మూడు వేల మంది ఎస్ఎల్ఎఫ్ లీడర్లను కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్లుగా నియమిస్తామని తెలిపారు. వైద్యసేవలు మరింత మెరుగుపరిచేందుకు మరో 200 బస్తీ దవాఖానాలు ఏర్పాటుచేస్తామన్నారు.
ఇవీ చూడండి: ఐదో విడత హరితహారంపై సీఎస్ దృశ్యమాధ్యమ సమీక్ష