పార్టీకి వ్యతిరేకంగా పోటీచేసిన వ్యక్తికి టికెట్ ఇచ్చారని వెల్లడించారు. తన తండ్రి, తానూ తెలంగాణ సాధనే లక్ష్యంగా రాజీలేని పోరాటం చేశామని గుర్తుచేశారు. తెలంగాణ మేలు కోసం కేసీఆర్ ఆహ్వానిస్తేనే పార్టీలోకి వచ్చానని స్పష్టం చేశారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగకుండా పోరాడటమే నేరమా అని ప్రశ్నించారు. పార్టీ బలహీనంగా ఉన్నచోట పటిష్ఠం చేశానని తెలిపారు.
టికెట్ హామీ ఇచ్చినా... పెద్దపల్లికి దూరంగా ఉంచడానికే కొందరు పనిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సలహాదారుగా ఎలాంటి ప్రయోజనాలు పొందలేదని చెప్పుకొచ్చారు. ఆ పదవి వల్లే హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడి పదవి కోల్పోయానని వాపోయారు. జీవితాంతం తెలంగాణ ప్రజల మేలు కోసం పనిచేస్తూనే ఉంటానని ప్రకటించారు.
ఇదీ చూడండి: చివరిరోజు కోలాహలం.. ముగిసిన నామినేషన్ల పర్వం