ETV Bharat / state

TTD LADDU: ప్రైవేటు ఏజెన్సీ చేతికి తితిదే లడ్డూ వితరణ కేంద్రాల సేవలు!

తిరుమల లడ్డూ ప్రసాద వితరణ కేంద్రంలో సేవలన్నింటినీ ఒకేచోట అందుబాటులోకి తెస్తామన్న తితిదే ప్రకటన కార్యరూపం దాల్చలేదు. అధికారుల ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండటం లేదు. కోట్ల వ్యయంతో ప్రైవేటు ఏజెన్సీని నియమించినా సౌకర్యాలు మాత్రం మెరుగుపడలేదని భక్తులు అంటున్నారు.

TTD LADDU
తితిదే లడ్డూ వితరణ
author img

By

Published : Jul 10, 2021, 1:44 PM IST

ఉచిత సేవల స్థానంలో నిర్వహణా వ్యయం చెల్లించి మరీ నూతన ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించే సమయంలో తితిదే అధికారులు చేసిన ప్రకటనలకు.. ప్రస్తుతం అందుతున్న సేవలకు లంకె కుదరడం లేదు. సేవలన్నీ ఒకే కేంద్రంలో అందుబాటులోకి వస్తాయన్న ప్రకటన అమలుకు నోచుకోలేదు. ప్రైవేటు ఏజెన్సీ సేవలు కూడా పాత పద్ధతిలోనే ఉండటం భక్తులను నిరాశ పరుస్తోంది.

గతంలో శ్రీవారి సేవకులు, వివిధ బ్యాంకులు ఉచితంగా అందించే సేవలను.. బెంగళూరుకు చెందిన కేవీఎం ఇన్ఫోకామ్‌ సంస్థకు తితిదే ఇటీవల అప్పగించింది. లడ్డూ కవర్లు మొదలు అన్ని సేవలు ఒకే కేంద్రంలో అందుబాటులోకి వస్తాయని అధికారులు ప్రకటించినా... వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. నెలకు 5 కోట్ల రూపాయల నిర్వహణా వ్యయం చెల్లించి ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడంతో... లడ్డూ విక్రయ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందుతాయని భక్తులు ఆశించారు.

దర్శన లడ్డూలు, అదనపు లడ్డూలు, వడ, కవర్ల కోసం కౌంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని భావించారు. ప్రైవేటు ఏజెన్సీ బాధ్యతలు తీసుకొని రెండు వారాలు గడుస్తున్నా, సేవల తీరు మాత్రం మారలేదని భక్తులు వాపోతున్నారు. ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించిన సేవల్లో మార్పులు లేనప్పుడు, తితిదేపై నిర్వహణా భారం పడటం తప్ప ఉపయోగమేంటనే విమర్శలు వస్తున్నాయి.

తితిదే లడ్డూ

ఇదీ చదవండి: తగ్గిన పసిడి ధర- ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.