కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. వెస్ట్ మారేడ్‌పల్లిలోని మంత్రి నివాసంలో సికింద్రాబాద్ గోల్డ్ అండ్ డైమండ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ. 11.58 లక్షల చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు.
ప్రవాస భారతీయురాలు రజిని రూ. 5 లక్షల చెక్కు అందజేశారు.
బోయినపల్లిలోని అంబేద్కర్ వెజిటబుల్ మార్కెట్ కమిటీ తరఫున తలసాని శంకర్ యాదవ్, ధనుంజయ గౌడ్, బీరయ్య, జనార్దన్ ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయల చెక్కును మంత్రికి ఇచ్చారు. కరోనా నేపథ్యంలో దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇవ్వడం పట్ల తలసాని శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు.
ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా లాక్ డౌన్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాంగోపాల్ పేట తెరాస అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, జగదీష్ వర్మ, సూర్య ప్రకాష్ రావు, ఆశిష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: లాక్డౌన్ తర్వాత ఐటీ కొలువుల పరిస్థితి ఏమిటంటే...