ETV Bharat / state

'ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది?'

author img

By

Published : Aug 11, 2020, 5:45 PM IST

తెలంగాణలో కరోనాను అదుపుచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే... కేంద్రం ఎందుకు మౌనంగా వహించిందో తెలపాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

former-mp-ponnam-prabhakar-on-bjp-national-chief-jp-nadda
'ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది?'

తెలంగాణ ప్రభుత్వంపై విచారణ జరిపించాలని... లేదంటే తెరాస పార్టీతో ఉన్న స్నేహాన్ని భాజపా అంగీకరించాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. అవసరం ఉన్నప్పుడల్లా తెరాస ప్రభుత్వ సహాయం తీసుకుంటున్నారని... ఆపై అనేక మాటలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.

గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంపై చాలాసార్లు మాట్లాడి వెళ్లారని... ఆ తర్వాత మాటలు కార్యరూపం ఎందుకు దాల్చలేదని నడ్డానుద్దేశించి ప్రశ్నించారు. కరోనా నియంత్రణలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైతే కేంద్ర ప్రభుత్వం మౌనం వహించిందని ఆరోపించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్రంలో ఒక్క పర్యటన కూడా చేయలేదన్నారు. జేపీ నడ్డా మాటలు నిజమే అయితే... కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వంపై ఎంక్వయిరీకి ఆదేశించాలన్నారు.

ఇదీ చూడండి: 'అమ్మోనియం నైట్రేట్ తరలింపు సర్వ సాధారణంగా జరిగేదే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.