తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ కుమార్తె వివాహా కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఘన స్వాగతం పలికారు. వివాహా కార్యక్రమంలో పాల్గొని వధువుని ఆశ్వీరదించారు. సీతాఫల్మండి మాజీ కార్పొరేటర్ విజయ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి చిదంబరానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
చిదంబరం వస్తున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సికింద్రాబాద్ తుకారం గేట్లో ఉన్న సంతోశ్ కుమార్ ఇంటికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఇదీ చూాడండి: ఒళ్లు గగుర్పొడిచేలా సాగిన తిరు ఉత్సవ్ పోటీలు...