తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచడం పట్ల భాజపా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌తో పాటు పలువులు భాజపా నేతలు కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్ కలిసి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని కోరినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు రవిశంకర్‌ప్రసాద్, కిషన్‌రెడ్డిలతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ధన్యవాదాలు తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చొరవతో ఇది సాధ్యమైందన్నారు.
ఇదీ చూడండి: corona cases: రాష్ట్రంలో కొత్తగా 1,813 కరోనా కేసులు నమోదు