కొత్తగా ఎన్నికైన సర్పంచులకు ఈనెల 29లోగా శిక్షణా కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. రెవెన్యూ, అటవీ భూముల సర్వే 90 శాతం పూర్తైందని...కేవలం ఐదు జిల్లాల్లోనే మిగిలి ఉందని రెవెన్యూ అధికారులు తెలిపారు. సర్వే పనులను వేగవంతం చేయాలని సీఎస్ కలెక్టర్లను కోరారు. వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలన్నారు. మంచినీటి కొరత లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వర్షాకాలంలో మొదలయ్యే ఐదో విడత హరితహారం కోసం నర్సరీలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని యంత్రాంగాన్ని సీఎస్ ఆదేశించారు.
వంద కోట్ల మొక్కలను నాటే లక్ష్యంతో 72 శాతం నర్సరీల్లో మొక్కల పెంపకం జరుగుతోందన్నారు. పెంచుతున్న మొక్కల్లో తప్పనిసరిగా 25 నుంచి 30 శాతం అటవీ పండ్ల జాతులు, మరో పది శాతం ఇళ్లలో పెంచుకునే మొక్కలు ఉండాలన్నారు. వందశాతం నర్సరీలు ఏర్పాటు చేసిన కొత్తగూడెం, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, అధికారులను అభినందించారు. హరితహారం కోసం అన్ని జిల్లాలు తమ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను సీఎస్ కోరారు. ఆగ్రో ఫారెస్ట్రీని ప్రోత్సహించాలనే ప్రభుత్వ నిర్ణయం ప్రకారం గంధపు, వెదురు మొక్కలను రైతులకు అందిస్తామన్నారు.
ఇవీ చూడండి:రాచకొండకు 5 పారామిలటరీ బలగాలు