ETV Bharat / state

Poonam kaur etela Rajender: 'ధర్మపోరాటం ఎల్లప్పుడూ గెలుస్తుంది' - hyderabad news

ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ను నటి పూనమ్ కౌర్ కలిశారు. గురునానక్ జయంతి సందర్భంగా ఈటల దంపతులను సన్మానించారు. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను ట్విటర్(poonam kaur twitter) వేదికగా ఆమె షేర్ చేశారు.

poonam kaur twitter, poonam kaur met etela rajender
ఈటలకు పూనమ్ శుభాకాంక్షలు
author img

By

Published : Nov 19, 2021, 4:27 PM IST

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను(Etela Rajender) సినీ నటి పూనమ్ కౌర్‌ శుక్రవారం కలిశారు. గురునానక్‌ జయంతి సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లిన పూనమ్.. ఈటల దంపతులను సన్మానించారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన ఈటలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ధర్మపోరాటం ఎల్లప్పుడూ గెలుస్తుందని ఈ సందర్భంగా ఆమె అభిప్రాయపడ్డారు. ఈటల రాజేందర్, పూనమ్ కౌర్, తుల ఉమ, గిరివర్థన్ రెడ్డి కలిసి శాంతికి చిహ్నంగా భావించే పావురాలను ఎగరవేశారు. ఆ ఫొటోలను ట్విటర్(poonam kaur twitter) వేదికగా ఆమె పంచుకున్నారు.

ఆ హ్యాష్ ట్యాగ్​తో సంచలనం

నటి పూనమ్​ కౌర్(Poonam Kaur tweet) పలు టాలీవుడ్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందారు. ఇటీవలె ఓ ప్రెస్​ మీట్​ ద్వారా పూనమ్ హాట్​టాపిక్​గా నిలిచారు. అయితే.. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే పూనమ్(poonam kaur pawan kalyan twitter)​ చేసిన ఓ ట్వీట్​ నెట్టింట వైరల్​గా మారింది. ట్విట్టర్​లో కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన పూనమ్.. 'పీకే లవ్'​ అని హ్యాష్ ​ట్యాగ్ జోడించారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. సినీ నటుడు పవన్​ కల్యాణ్​ పేరు 'పీకే' కావడం, పూనమ్​ కౌర్​ షార్ట్​ నేమ్​ కూడా పీకే కావడం వల్ల ఈ పోస్ట్​పై విభిన్న స్పందన వస్తోంది. నెటిజన్లను కన్ఫ్యూజ్​ చేయడంలో పూనమ్​ సఫలమయ్యారనే చెప్పాలి.

మా ఎన్నికల సమయంలో కీలక వ్యాఖ్యలు

గతంలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల సమయంలో పూనమ్ చురుకుగా పాల్గొన్నారు. ప్రకాశ్‌రాజ్(maa elections prakash raj panel) గెలవాలని తాను కోరుకుంటున్నట్టు అప్పట్లో ఆమె తెలిపారు(Poonam kaur movies). ఈ మేరకు ప్రకాశ్‌రాజ్‌తో కలిసి దిగిన ఫొటోని పంచుకుంటూ ఓ ట్వీట్‌ అప్పట్లో పెట్టారు. " 'మా' ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌(Maa elections 2021) సర్‌ గెలవాలని కోరుకుంటున్నా. ఆయన విజయం సాధిస్తే ఇంతకాలం నేను ఎదుర్కొన్న సమస్యల్ని బయటపెడతా. ఆయన చిల్లర రాజకీయాలు చేయరు' అని పేర్కొన్నారు.

'శౌర్యం', 'గణేష్‌', 'గగనం', 'శ్రీనివాస కల్యాణం' సహా పలు చిత్రాల్లో పూనమ్‌ కౌర్‌ నటించి మెప్పించారు. ప్రకాశ్‌రాజ్‌-పూనమ్‌ కలిసి 'గగనం', 'శ్రీనివాస కల్యాణం' చిత్రాల్లో నటించారు. పూనమ్ తాజా చిత్రం 'మంజినా హని' ఈనెల 25న విడుదల కానుంది. అంతా నీ మాయలోనే, వెట్టై మన్నన్ చిత్రాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.