ETV Bharat / state

నయాసాల్​ వేడుకలపై ఆబ్కారీ శాఖ నిఘా

author img

By

Published : Dec 31, 2019, 5:40 AM IST

Updated : Dec 31, 2019, 5:19 PM IST

నూతన సంవత్సరం పురస్కరించుకుని ఆబ్కారీ శాఖ అప్రమత్తమైంది. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్​తో పాటు నాటుసారా, కల్తీ కల్లు, మిథనాల్ ఉత్పత్తి, నిల్వలపై దృష్టి సారించాలని యంత్రాంగాన్ని ఆ శాఖ కమిషనర్ సర్ఫరాజ్​ అహ్మద్​ ఆదేశించారు. మద్యం వాడకం అధికంగా ఉన్నందున గరిష్ఠ చిల్లర ధర ఉల్లంఘనలు జరిగే అవకాశం ఉండడం వల్ల ఎన్​ఫోర్స్​మెంట్​ విభాగం నిఘా పెట్టింది.

excise department keep an eye on liquor selling in telangana as on the eve of new year
నయాసాల్​ వేడుకలపై ఆబ్కారీ శాఖ నిఘా
నయాసాల్​ వేడుకలపై ఆబ్కారీ శాఖ నిఘా

నయాసాల్​ షురూ అవుతున్నందున తెలంగాణలో మద్యం వాడకం అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి బుధవారం అర్ధరాత్రి వరకు మద్యం వాడకం అధికం కానుండటం వల్ల ఆబ్కారీ శాఖ అప్రమత్తమైంది. ఆ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్... రాష్ట్రంలోని ఆబ్కారీ శాఖ ఉప కమిషనర్లు, సహాయ కమిషనర్లు, ఎన్​ఫోర్స్​మెంట్​ విభాగాల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

మిథనాల్​పై నిఘా

ప్రధానంగా రాష్ట్ర సరిహద్దుల నుంచి రాష్ట్రంలోకి నాన్ డ్యూటీ పెయిడ్ సరఫరా అయ్యే అవకాశం ఉందని అధికారులను సర్ఫరాజ్​ హెచ్చరించారు. మద్యం కల్తీ చేసేందుకు ఉపయోగించే మిథనాల్ తయారీ కేంద్రాలపై గట్టి నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. మిథనాల్ పక్కదారి పట్టి అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లినట్లయితే అనుకోని ఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఎలా వచ్చింది?

పరిశ్రమలకు వాడే ఆల్కాహాల్ సరఫరా, నిల్వలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఎక్కడైనా... మిథనాల్ దొరికినట్లయితే అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందో తెలుసుకోవాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో సమాచార సేకరణ పటిష్ఠంగా జరిగేటట్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

సోదాలు చేయాలి

బయటి రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం చొరబాటు అయ్యే అవకాశం ఉన్నందున అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. సహాయ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బృందాలను సిద్ధం చేసి సోదాలు చేయాలని ఆదేశించారు. కల్తీ మద్యం, నాటుసారా అధికంగా వాడే అవకాశం ఉందని​ తెలిపారు. రాష్ట్రంలోని ఆబ్కారీ శాఖ సీఐలు వారి పరిధిలోని ప్రత్యేక బృందాలతో సోదాలు నిర్వహించాలని ఆదేశించారు.

Tg_hyd_22_31_excise dept_alert_pkg_3038066 Reporter: Tirupati Reddy ( ) నూతన సంవత్సరం పురస్కరించుకొని ఆబ్కారీ శాఖ అప్రమత్తమైంది. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తో పాటు నాటుసారా, కల్తీకల్లు మిథనాల్ ఉత్పత్తి, నిల్వలపై దృష్టి సారించాలని యంత్రాంగాన్ని ఆ శాఖ కమిషనర్ ఆదేశించారు. మద్యం వాడకం అధికంగా ఉండడంతో గరిష్ట చిల్లర ధర ఉల్లంఘనలు జరిగే అవకాశం ఉండడంతో ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిఘా పెట్టింది. Look వాయిస్ ఓవర్1: నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మద్యం వాడకం ఇవాళ్టి నుంచి ఒక్కసారిగా అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. ఈ మధ్యాహ్నం నుంచి బుధవారం అర్ధరాత్రి వరకు మద్యం వాడకం క్రమంగా అధికం కానుంది. దింతో ఆబ్కారీ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఆ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ రాష్ట్రంలోని ఆబ్కారీ శాఖ ఉప కమిషనర్లు, సహాయ కమిషనర్లు, ఎన్ఫోర్స్మెంట్ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రధానంగా రాష్ట్ర సరిహద్దుల నుంచి రాష్ట్రంలోకి నాన్ డ్యూటీ పెయిడ్ సరఫరా అయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు, ప్రధానంగా మద్యం కల్తీ చేసేందుకు ఉపయోగించే మిథనాల్ తయారీ కేంద్రాలపై గట్టి నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. మిథనాల్ పక్కదారి పట్టి అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిట్లయితే అనుకోని ఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న ఆబ్కారీ శాఖ రాష్ట్రంలోని అన్ని ఎక్సైజ్ విభాగాలు దీని పై ప్ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పరిశ్రమలకు వాడే ఆల్కహాల్ సరఫరా... నిల్వలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని కమిషనర్ సూచించారు...ఎక్కడైనా తయారీ కేంద్రంలో మిథనాల్ దొరికినట్లయితే అది ఎక్కడి నుంచి,..... ఎలా వచ్చింది…. తదితర అంశాలపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో సమాచార సేకరణ పటిష్టంగా జరిగేట్లు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బయట రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం చొరబాటు అయ్యే అవకాశం ఉన్నందున అధికారులు తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. సహాయ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బృందాలను సిద్ధం చేసి తనిఖీలు చేయాలని అన్నారు. గరిష్ట చిల్లర ధర ఉల్లంఘనలు జరిగే అవకాశాలు ఉన్నందున గట్టి నిఘా ఉంచాలని తెలిపారు. కల్తీ మద్యం నాటుసారా కొత్తసంవత్సరం సందర్భంగా అధికంగా వాడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఆబ్కారీ శాఖ సిఐలు వారి పరిధిలోని ప్రత్యేక బృందాలతో సోదాలు నిర్వహింప చేయాలని పేర్కొన్నారు. నా డ్యూటీ పెయిడ్ లిక్కర్, నాటుసారా, కల్తీకల్లు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ కిందిస్థాయి అధికారులని ఆదేశించారు.
Last Updated : Dec 31, 2019, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.