ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@9PM

నేటి ప్రధాన వార్తలు

author img

By

Published : May 17, 2020, 9:00 PM IST

Updated : May 17, 2020, 9:12 PM IST

టాప్​టెన్​ న్యూస్​@9PM
టాప్​టెన్​ న్యూస్​@9PM

దేశవ్యాప్తంగా మే 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31వరకు పొడిగించింది కేంద్రం. నేటితో మూడో విడత లాక్‌డౌన్‌ గడువు పూర్తవుతున్నందున ఎన్​డీఎంఏ ఉత్తర్వులు జారీ చేసింది. లాక్​డౌన్​ 4.0 వివరాలు

ప్యాకేజ్ 5.0

ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీ వివరాలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఐదో రోజు వెల్లడించారు. ఈసారి ప్రకటించిన వివరాలు

గోదావరి జలాల వినియోగంపై కొనసాగుతున్న కేసీఆర్‌ సమీక్ష

ఈ వర్షాకాలంలో గోదావరి నదీ జలాలను వినియోగించే ప్రణాళిక రూపొందించేందుకు ప్రగతిభవన్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం కొనసాగుతోంది. సమీక్షలో ప్రస్తావించే మరిన్ని అంశాలు

రాష్ట్రంలో ఇవాళ 42 కరోనా పాజిటివ్​ కేసులు

తెలంగాణలో ఆదివారం 42 కరోనా పాజిటివ్​ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. బాధితుల వివరాలు

తీవ్ర తుపానుగా ఉమ్​ పున్​​..

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. మరింత బలపడి తీవ్ర తుపానుగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో భారీ ప్రభావం

దేశంలో 13.6 కోట్ల ఉద్యోగాలకు కరోనా గండం

కరోనా సంక్షోభం, లాక్​డౌన్​లో భారత ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో... 13 కోట్ల 60 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని, 12 కోట్ల మంది పేదరికంలోకి జారుకుంటారని ఓ నివేదిక పేర్కొంది. ఇంకా ఆ నివేదికలో ఏముందంటే..?

సడలింపులు.. బిగింపులు

మానవాళి జీవితాలను అల్లకల్లోలం చేసిన కరోనాతో అలుపెరుగక పోరాడుతోంది ప్రపంచం. కొన్ని దేశాలు కఠిన నిబంధనలతో వైరస్​ను కట్టడి చేస్తే.. మరికొన్ని మాత్రం ముక్కుతాడు వేయలేక సతమతమవుతున్నాయి. ఎందుకంటే..?

హైడ్రాక్సీ క్లోరోక్విన్​తోనే అధిక మరణాలు!

కరోనా మహమ్మారిపై ప్రభావవంతంగా పనిచేస్తుందని భావిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్​తోనే ప్రాణాపాయం ఎక్కువని అమెరికాలోని ఓ పరిశోధన వెల్లడించింది. అది ఎలా అంటే..?

తెరుచుకోనున్న క్రీడా ప్రాంగణాలు, స్టేడియాలు.. కానీ..

కరోనా లాక్​డౌన్ నాలుగో విడత మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. క్రీడా ప్రాంగణాలకు, స్టేడియాలకు సడలింపులు ఇచ్చింది. అవేంటంటే..?

నటి పాయల్ షార్ట్ ఫిల్మ్.. 24 గంటల్లోనే చిత్రీకరణ

నటి పాయల్ రాజ్​పుత్ లాక్​డౌన్ కారణంగా ఇంటివద్దే ఉంటున్నారు. ఈ ఖాళీ సమయంలో తన బాయ్​ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రా దర్శకత్వం వహించిన 'ఏ రైటర్' అనే షార్ట్ ఫిల్మ్​లో నటించారు. ఆమె నటన ఎలా ఉందంటే..?

Last Updated : May 17, 2020, 9:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.