ETV Bharat / state

కష్టాలు గెలిచారు.. కరోనాను ఓడించారు!

పండుటాకులు.. కాలప్రవాహంలో అనుభవాల గుర్తులు.. రేపటికి దిశానిర్దేశం చేసే మార్గదర్శకులు. ఎన్నో ఇబ్బందులు.. మరెన్నో ఎదురుదెబ్బలు. కష్టసుఖాలు చూసిన జీవితాలు. కిందపడిన ప్రతిసారి నిలదొక్కుకున్నారు. జీవితపు లోటుపాట్లను చవిచూశారు. మహమ్మారి గుబులు పుట్టిస్తున్న వేళ అదే వయోధికులు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. భయం వదిలి.. కొవిడ్‌ను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. అలాంటి కొందరు వృద్ధుల విజయగాథలు ఇవి..

elders-recover-from-covid-with-will-power
కష్టాలు గెలిచారు.. కరోనాను ఓడించారు!
author img

By

Published : May 16, 2021, 9:30 AM IST

ఆర్టీసీ కండక్టర్‌గా పని చేసి పదేళ్ల క్రితం పదవీ విరమణ చేసిన వృద్ధుడు(70), అతని భార్య(65) గత నెల మొదటి వారంలో కొవిడ్‌ టీకా తీసుకున్నారు. 15 రోజుల తరువాత మహమ్మారి బారినపడ్డారు. దగ్గు, జ్వరంతో రెండు రోజులు ఇబ్బందిపడ్డారు. పది రోజుల్లోనే తేలికగా బయటపడ్డారని వృద్ధ దంపతుల బంధువులు చెప్పారు. వృద్ధాశ్రమంలో ఉంటున్న ఒక మహిళ(82) రెండో డోసు తీసుకున్న మూడురోజులకు జ్వరం రావటంతో పరీక్ష చేయించారు. కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారించారు. కేవలం జ్వరం మాత్రతో ఆమె తేలికగా బయటపడ్డారని.. ఆమెకు చికిత్స అందించిన వైద్యురాలు వివరించారు. ఇలా మనోధైర్యంతో కరోనాను జయించిన కొందరు తమ గెలుపు ప్రయాణ అనుభవాల్ని పంచుకున్నారు.

చిన్నపిల్లాడిలా కాపాడుకున్నారు..

లక్ష్మీనారాయణ

నీరసంగా ఉందని ప్రభుత్వ బస్తీ దవాఖానాలో పరీక్ష చేయించుకోగా.. పాజిటివ్‌ వచ్చింది. భయమేసినా, నాకు నేనే ధైర్యం చెప్పుకొన్నా. మందుల కిట్‌ వాడా. కుమారుడు, కోడలు, మనవళ్లు చెప్పిన ధైర్యమే మమ్మల్ని కాపాడింది. వైద్యులు, నర్సుల సలహాలతో గుడ్లు, తాజాపండ్లు, డ్రైఫ్రూట్స్‌ తిన్నా. నా మనవరాలు వేరే గది నుంచే ప్రాణాయామం ఎలా చేయాలో సూచించేది. మా వాళ్లు లేకుంటే నేను లేను. చిన్నపిల్లాడిలా కాపాడుకున్నారు. వారి ఆదరణతో వారం రోజులకే సాధారణ స్థితికి వచ్చాను.

- లక్ష్మీనారాయణ (62) ప్రైవేటు ఉద్యోగి, బీఎన్‌రెడ్డి నగర్‌.

కుటుంబసభ్యుల ప్రార్థనలతో బతికా

కేఎస్‌ఆర్‌ హరనాథ్‌

ఏప్రిల్‌ 18న జలుబు, దగ్గు వచ్చింది. ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోగా.. నా కుమారుడు(40), నేనూ కరోనా బారినపడ్డాం. మా కోడలికి నెగెటివ్‌ వచ్చింది. మొదట్లో ఓ ప్రైవేటు ఆస్పత్రివారిచ్చిన మందులు వాడాం. మా కుమారుడికి ఆక్సిజన్‌ స్థాయిలు బాగా తగ్గి.. వెంటిలేటర్‌పై చికిత్సపొందుతూ చనిపోయాడు. నాకు ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోవడంతో ఐసీయూలో పెట్టారు. స్టెరాయిడ్స్‌, ఇంజక్షన్లు తట్టుకోలేక డిశ్ఛార్జి చేయండని వైద్యులతో మొరపెట్టుకున్నాను. నా బాధచూసి జనరల్‌ వార్డుకు మార్చారు. ఆక్సిజన్‌ పెట్టారు. క్రమంగా ఆరోగ్యం మెరుగుపడడంతో ఇంటికి పంపించారు. కోడలు, కుమార్తె, అల్లుడు, మనవళ్ల ప్రార్థనలే నన్ను బతికించాయి.

-కేఎస్‌ఆర్‌ హరనాథ్‌(72) విశ్రాంత ఉద్యోగి, చింతల్‌.

బతకాలనే కోరికే బయటపడేసింది..

ఆధ్యాత్మికత తెలియని శక్తినిస్తుంది. ఏప్రిల్‌ 20న పాజిటివ్‌ అని తేలింది. నాకు మధుమేహ సమస్య ఉంది. 8 మంది సంతానం. ఆరుగురి పెళ్లిళ్లు జరిగాయి. ఒక కుమార్తె, కుమారుడు స్థిరపడాల్సి ఉంది. వారి కోసం బతకాలని బలంగా నిర్ణయించుకున్నా. క్రమం తప్పకుండా నమాజ్‌, శ్వాస సంబంధమైన వ్యాయామాలు చేశాను. హోంఐసొలేషన్‌లోనే 5 రోజులున్నా. ఆరోరోజు నుంచి శ్వాస తీసుకోవటం కష్టంగా ఉండడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరా. నా పక్కనే పడక మీద ఉన్న వ్యక్తి మరుసటిరోజు కనిపించేవాడు కాదు. అలా.. నాలుగైదు సంఘటనలు భయానికి గురిచేశాయి. పసితనం నుంచి ఎన్నో మరణాలు చూశాను. వ్యాపారంలో నష్టపోయి నిద్రకు దూరమయ్యాను. అవన్నీ గుర్తుకుతెచ్చుకుని ధైర్యం చెప్పుకొనేవాణ్ని. పిల్లలు వీడియోకాల్‌లో పలకరిస్తూ అభయమిచ్చేవారు.మొండితనం.. కష్టాలు చూసిన అనుభవాలు కరోనా నుంచి బయటపడేశాయి.

- అహ్మద్‌ఖాన్‌(61), విశ్రాంత ఉద్యోగి, గచ్చిబౌలి

ఇదీ చూడండి: కొవిడ్ బాధితులకు అండగా.. సింగరేణి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.