ETV Bharat / state

ఓటు వేసేందుకు క్యూ ఎంత ఉంది - ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చు : సీఈఓ వికాస్​రాజ్​ - సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ ఏర్పాట్లు

EC CEO Vikas Raj Interview : గురువారం రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్​ జరగనుంది. ఓటు వేసే ప్రతి పోలింగ్​ కేంద్రం పండగ వాతావరణంలా ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్​రాజ్​ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి సమస్య రాకుండా ఉండేలా అధికారులకు శిక్షణ ఇచ్చామని స్పష్టం చేశారు. గతం కంటే మెరుగైన ఓటింగ్ శాతం నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Vikas Raj on Polling Arrangements in Telangana
EC CEO Vikas Raj Interview
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2023, 5:12 PM IST

Updated : Nov 30, 2023, 6:37 AM IST

ఓటు వేసేందుకు క్యూ ఎంత ఉంది- ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చు సీఈఓ వికాస్​రాజ్​

EC CEO Vikas Raj Interview : సంతోషంగా ఉండాలని.. గ్రామాల్లో సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండగనే ఎంత ఆడంబరంగా నిర్వహిస్తాం.. అలాంటిది మన జీవితాలను మార్చే ఎన్నికలు.. అది కూడా 5 సంవత్సరాలకు వస్తాయి. వాటిని ప్రశాంతంగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్​రాజ్(Vikas Raj) తెలిపారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు వేయవచ్చని.. పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు పొందుపరిచామని.. అవసరమైతే రవాణా ఏర్పాటు చేస్తామని తెలిపారు. మరింత సమాచారం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

1. పోలింగ్​ సంబంధించి ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయా..? సిబ్బంది అంతా సిద్ధమయ్యారా?

జవాబు : మేం సిద్దమయ్యాము. పోలింగ్​ కేంద్రాలకు సిబ్బంది వెళ్తున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే చేరుకున్నారు. వారికి సామాగ్రి పంపించాం. ఈవీఎంలు పని చేస్తున్నాయో లేదో పరిశీలిస్తున్నారు. ఈవీఎంల(EVM)ను తీసుకుని సెక్టార్ ఆఫీసర్​తో వారికి కేటాయించిన వాహనాల్లో వెళ్లేలా ఏర్పాటు చేశాం. ప్రైవేట్​ వాహనాల్లో వెళ్లకూడదని.. పోలింగ్​ అధికారులకు ముందుగానే సూచనలు ఇచ్చాం. పోలింగ్​ కేంద్రాల దగ్గర కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సాయంత్రం 6 గంటలకు సిబ్బంది మొత్తం చేరుకుంటారని అనుకుంటున్నాను.

2. పోలింగ్​ కేంద్రాల్లో ఓటర్ల కోసం ఎటువంటి వసతులు కల్పించారు?

జవాబు : ఈ ఎన్నికలు జరిగినంత వరకు పండగ వాతావరణాన్ని నెలకొల్పాలని.. మోడల్ పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈసీ నుంచి ఆదేశాలు వచ్చాయి. అందువల్ల ఈ ఎన్నికల్లో అన్ని రకాల సౌకర్యాలు ఓటర్లు చూస్తారు. వీటితో పాటు దివ్యాంగుల కోసం, వృద్ధుల కోసం.. ఇంటి దగ్గర నుంచి పోలింగ్​ కేంద్రం వరకు వారు కోరితే రవాణా సదుపాయం ఏర్పాటు చేస్తాం. అలానే పోలింగ్​ కేంద్రాల్లో(Polling Centers) వీల్​ఛైర్స్​ ఏర్పాటు చేశాం. వారికి సాయం చేసేందుకు అక్కడ వాలంటీర్లను కూడా పెట్టాం.

అంధుల కోసం బ్రెయిల్​ లిపి(Braille Lipi Ballots)లో పోస్టల్ బ్యాలెట్​, పోస్టర్స్​ అందుబాటులో ఉంచాం. దీనివల్ల వారికి నచ్చిన నాయకున్ని ఎన్నుకోవచ్చు. వినికిడి లోపం ఉన్న వారికి కూడా పోస్టర్లు తయారుచేశాం. వారితో మాట్లాడే విధంగా పోలింగ్​ అధికారులకు శిక్షణ ఇచ్చాం.

ఓటరు మహాశయా మేలుకో - ఇకనైనా బద్ధకాన్ని వీడి పోలింగ్ కేంద్రానికి పోటెత్తు

3. రాష్ట్రంలో మొత్తం 35 వేలకు పైగా పోలింగ్​ కేంద్రాలు ఉన్నాయి. గురువారం ఎట్లా పర్యవేక్షణ చేయనున్నారు?

జవాబు : ప్రతి పోలింగ్​ కేంద్రంలో సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. సమస్యాత్మక కేంద్రాల్లోనే కాకుండా, సామాన్య కేంద్రాల్లో కూడా వెబ్​కాస్టింగ్​ ఉంటుంది. మైక్రో పరిశీలకులు కూడా ఉంటారు. సీఆర్​ఫీఎస్​ బలగాలు ఉంటాయి. శాంతిభద్రతలకు ఏమైనా భంగం కలిగినట్టు అనిపిస్తే వారు వెంటనే స్పందించి.. పరిస్థితిని అదుపులోకి తీసుకుంటారు.

4. రాష్ట్రంలో సెలవు ప్రకటించినప్పటికీ.. కొన్ని ప్రైవేట్​ సంస్థలు సెలవు ఇవ్వలేదనే వార్తలు వస్తున్నాయి?

జవాబు : రాష్ట్ర ప్రజలకు సెలవు కూడా ప్రకటించాం. ఓటర్లు నిర్భయంగా ఓటు వేయవచ్చు. కొన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించలేదని సమాచారం మాకు అందింది. వారికి మేము చెప్పాం. డీఈఓలకు సమాచారం అందించాం. అన్ని సంస్థలు సెలవు ప్రకటించేలా చూసుకోవాలని సూచనలు ఇచ్చాం.

5. రాష్ట్రంలో సమస్యాత్మక కేంద్రాలు ఎన్ని ఉన్నాయి. అక్కడ పోలింగ్​ సజావుగా జరిగేందుకు ఎలాంటి ఏర్పాట్లు తీసుకున్నారు?

జవాబు : రాష్ట్రంలో సుమారు 12,000 పోలింగ్​ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో వెబ్​కాస్టింగ్​, మైక్రో పరిశీలకులు ఉంటారు. కేంద్ర బలగాలు ఉంటాయి. ఎటువంటి సమస్య రాకుండా చూసేలా ఏర్పాటు చేశాం.

6. ఎన్నికల కోడ్​ అమలు అయినప్పటి నుంచి రాష్ట్రంలో దాదాపు రూ.740 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కొనసాగుతున్నాయి. ఇలాంటి విషయాల్లో ఏమి చేయనున్నారు?

A. రాష్ట్రంలో కోడ్​ అమల్లో ఉన్నప్పటి నుంచి అధికారులు విజయవంతంగా పనిచేశారు. అందుకే పెద్ద ఎత్తున నగదు లభించింది. ఈ రోజు రాత్రి కూడా భారీగా నగదు దొరకవచ్చు. ఇవాళ మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పాం. ఏమైనా ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించాలని తెలిపాం. ప్రతి గ్రామంలో నిఘా పెంచాలని తెలియజేశాం.

7. ఎన్నికల ప్రచారం ముగిసిన తరవాత ఇప్పటి నుంచి మరింత కీలకమని చెప్పారు. దీనికి స్పందన ఇప్పటివరకు ఎలా వచ్చింది?

జవాబు : రాష్ట్రంలో చాలా వరకు అధికారులు కంట్రోల్ చేశారు. రాత్రే రెండు ఫిర్యాదులు వస్తే వాటిని పరిష్కరించాం.

8. రాష్ట్రంలో ఓటింగ్​ శాతాన్ని పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

జవాబు : అర్బన్​ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేశాం. గత ఎన్నికలను పరిశీలిస్తే హైదరాబాద్​ వంటి నగరాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతోందని గమనించాం. అందువల్ల పెద్ద ఎత్తున ఓటు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేశాం. ఓటర్లకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తే ఓటు వేస్తారో తెలుసుకుని.. దానికి తగిన విధంగా యాప్​ రూపొందించాం. దీని ద్వారా పోలింగ్​ కేంద్రాల్లో క్యూలైన్ చూసుకునేందుకు వీలుగా ఉంటుంది. ఓటు వేయాలంటే ఎంత సమయం పడుతుందో తెలుసుకోవచ్చు. పోలింగ్​ కేంద్రాల్లో పార్కింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందని.. ముఖ్యంగా యువత మందుకు వచ్చి ఓట్లు వేస్తారని నేను ఆశిస్తున్నాను.

9. పోలింగ్​ రేపు ఉదయం మొదలు కానుంది. ఓటర్లకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి ?

జవాబు : ఇదే చివరి రోజు.. ఓటర్లు అందరు ఆలోచించి ఓటు వేయాలి. ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదు. మీ కుటుంబసభ్యులు, చుట్టుపక్కల కుటుంబసభ్యులతో వచ్చి సంతోషంగా ఓటు వేయాలని కోరుతున్నాను.

మీకు "ఓటర్​ స్లిప్​" ఇంకా అందలేదా? ఇలా సింపుల్​గా అందుకోండి!

ప్రలోభాలకు లొంగకుండా ప్రతిఒక్కరు నిర్భయంగా ఓటు వేయాలి : వికాస్​రాజ్​

ఓటు వేసేందుకు సొంతూళ్ల బాట పట్టిన ఓటర్లు - కిటకిటలాడుతున్న బస్టాండ్‌ పరిసరాలు

Last Updated : Nov 30, 2023, 6:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.