ETV Bharat / state

మత్తుమందుల ముఠాల్లో గట్టి ఇన్​ఫార్మర్​ వ్యవస్థ.. చిక్కిన కీలక సూత్రధారి - Hyderabad Latest News

మత్తుమందుల చీకటి ప్రపంచంలో నేరగాళ్లు డేగకళ్లతో వ్యవహరిస్తున్నారని హైదరాబాద్‌ పోలీసులు, నార్కొటిక్స్‌ ఎన్‌ఫోర్స్​మెంట్‌ వింగ్‌ అధికారులు గుర్తించారు. దేశంలో వెయ్యిమందితో డ్రగ్స్ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్న సూత్రధారి నరేంద్ర ఆర్య.. నాలుగైదేళ్లలోనే కోట్లలో లావాదేవీలు నిర్వహించాడని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. రెండు నెలలుగా అతడి కదలికలను గమనిస్తూ ఆధారాలు సేకరించగానే అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

నరేంద్ర ఆర్య
నరేంద్ర ఆర్య
author img

By

Published : Sep 3, 2022, 8:51 AM IST

డ్రగ్స్ నెట్‌వర్క్‌ సూత్రధారి నరేంద్ర ఆర్య అరెస్ట్

మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్న ముఠాల కదలికలపై హైదరాబాద్‌ పోలీసులు నిఘా పెంచారు. ఇందులో భాగంగా నిందితులు కూడా పోలీసులకు చిక్కకుండా వ్యవహరిస్తున్నారని గుర్తించారు. దేశంలో వెయ్యి మందితో డ్రగ్స్ నెట్​వర్క్​ ఏర్పాటు చేసుకున్న నరేంద్రఆర్యను అరెస్ట్ చేశారు. నరేంద్ర ఆర్య హరియాణాకు చెందిన 45ఏళ్ల మాదకద్రవ్యాల వ్యాపారి. పదిహేనేళ్ల నుంచి ఆఫ్రికా దేశాల నుంచి కొకైన్‌, హెరాయిన్‌, ఎల్ఎస్​డీ వంటి డ్రగ్స్‌ను తెప్పిస్తూ మెట్రోనగరాల్లో సరఫరా చేస్తున్నాడు.

మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతున్నాకొద్దీ ఆదాయం పెరుగుతుండడంతో.. విశాఖపట్నం, విజయవాడ, కోయంబత్తూరు, మైసూరు వంటి నగరాల్లో ఏజెంట్లకు మాదకద్రవ్యాలు పంపుతున్నాడు. హరియాణా, పంజాబ్‌ పోలీసులు మాదకద్రవ్యాల స్మగ్లర్లపై గట్టి నిఘా పెట్టారు. దీంతో ఏడాది క్రితం హరియాణా నుంచి గోవాకు మకాం మార్చాడు. తనవద్ద ఒక్క గ్రాము డ్రగ్స్‌ లేకుండా డార్క్‌నెట్‌ ద్వారా సరఫరా చేస్తూ బిట్‌కాయిన్ల ద్వారా డబ్బు తీసుకుంటున్నాడు.

హైదరాబాద్‌లో అంతర్జాల ఆధారిత డ్రగ్స్‌ సరఫరాపై మాదకద్రవ్యాల నిరోధక విభాగం అధికారులకు అనుమానం వచ్చి ఆరా తీయగా నరేంద్ర ఆర్య నెట్‌వర్క్‌ సూత్రధారిగా గుర్తించారు. గోవాలో ఉన్నట్టు తెలుసుకుని రెండు నెలలుగా అతడి కదలికలను అనుసరిస్తూ గట్టి ఆధారాలు లభించగానే అరెస్ట్‌ చేశారు. ఆఫ్రికా దేశాలు, గోవా నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసి విక్రయిస్తున్న నరేంద్ర ఆర్య.. నాలుగైదేళ్లలోనే కోట్లలో లావాదేవీలు నిర్వహించాడని పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు.

హరియాణా, పంజాబ్‌ పోలీసులకు దొరక్కుండా నరేంద్ర ఆర్య ఏడాది క్రితం గోవాకు వెళ్లాడు. కొద్దిరోజుల తర్వాత పర్యాటక వీసాతో వచ్చిన రష్యన్‌ యువతిని పెళ్లి చేసుకున్నాడు. గోవా శివారులోని ఓ ఇంట్లో ఇద్దరూ నివాసముంటున్నారు. ఇంటి బయట కుక్కలు ఎక్కువగా ఉండడంతో వాటిపై నరేంద్ర ఆర్యకు జాలి కలిగింది. రోజూ ఆహారం వేస్తుండగా మరికొన్ని కుక్కలు వచ్చాయి. ఇలా వందకుపైగా కుక్కలకు రోజూ ఆహారం పెడుతుండడంతో అతడి ఇంట్లో, బయట నివాసముంటున్నాయి. ఎవరైనా కొత్త వ్యక్తులొస్తే వారిపై దాడికి దిగుతున్నాయి. అతడి ఆచూకీ తెలుసుకున్నాక కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌ పోలీసులు గోవాకు వెళ్లారు.

ఇంటికి సమీపంలోకి వెళ్లగానే కుక్కలు దాడిచేయడానికి ప్రయత్నించడంతో పోలీసులు తిరిగి వచ్చారు. దేశవ్యాప్తంగా విస్తృత నెట్‌వర్క్‌ నిర్వహిస్తున్న నరేంద్ర ఆర్య పోలీసులకు అంత సులభంగా దొరకలేదు. మాదకద్రవ్యాల నిరోధక విభాగం అంచెలంచెలుగా కూపీ లాగుతుండగా.. ఐదో అంచె పరిశోధనలో నరేంద్ర ఆర్య ఆచూకీ పోలీసులకు లభించింది. డార్క్‌నెట్‌లో లావాదేవీలు నిర్వహిస్తున్నవారి వివరాలు చూస్తుండగాఅతడి నెట్‌వర్క్‌ కనిపించింది.

నరేంద్ర ఆర్య దేశంలో వెయ్యి మందితో కలిసి డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకున్నాడని పోలీసులు గుర్తించారు. మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముఠాలపై నిఘా వేసిన హెచ్‌-న్యూ విభాగం నాలుగైదు నెలల్లో 28మంది నిందితులను అరెస్ట్‌ చేశారు. వీరు గోవా, మంగళూరు, విశాఖపట్నం నుంచి మాదకద్రవ్యాలను కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి: హైదరాబాద్‌లో ‘డార్క్‌ వెబ్‌’ మత్తు దందా.. 8 మంది సభ్యుల ముఠా అరెస్ట్

'భారత జాతీయ భాషగా సంస్కృతం'.. సుప్రీంకోర్టు ఏమందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.