దేశంలోని చిన్నారుల్లో సుమారు 35 నుంచి 40 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారని పలువురు వైద్యులు అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఊబకాయదినాన్ని పురస్కరించుకుని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇండో యూఎస్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ శరత్‌చంద్ర, పోషకాహార నిపుణులురాలు డాక్టర్ అపర్ణ నెమలికంటి, ఊబకాయం, మధుమేహ వ్యాధుల నిపుణులు డాక్టర్ సురేందర్ సహా పలువురు వైద్యులు పాల్గొన్నారు.
చిన్నారుల్లో పెరుగుతున్న ఊబకాయ సమస్య భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని డాక్టర్ శరత్‌చంద్ర అన్నారు. ఊబకాయం కారణంగా కాలేయ, గుండె సంబంధిత వ్యాధులతో పాటు మధుమేహం భారిన పడుతున్న వారు అధికంగా ఉంటున్నారని తెలిపారు. మహిళల్లో సంతానేలమికి కూడా ఊబకాయం కారణమవుతోందని అభిప్రాయపడ్డారు. సరైన ఆహారం, వ్యాయామంతో అధికబరువును తగ్గించుకోవచ్చని సూచించారు.
ఇదీ చదవండి: 'నిబంధనలు పాటించకపోతే వైరస్ విజృంభించే అవకాశం'