ETV Bharat / state

'జీహెచ్ఎంసీ కృషికి ప్రజలు కూడా సహకరించాలి' - Deputy Speaker launched Sanitation Vehicles

జీహెచ్ఎంసీ ద్వారా కొత్తగా సికింద్రాబాద్ నియోజకవర్గానికి సమకూరిన 6 శానిటేషన్ ఆటోలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సీతాఫల్​మండి ముల్టీపర్పస్ హాల్ వద్ద ప్రారంభించారు.

Sanitation Vehicles
శానిటేషన్ ఆటోలు
author img

By

Published : Mar 30, 2021, 4:29 PM IST

పరిసరాల పరిశుభ్రతలో జీహెచ్ఎంసీ చేస్తున్న కృషికి ప్రజలు కూడా సహకరించాలని ఉపసభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. జీహెచ్ఎంసీ ద్వారా కొత్తగా సికింద్రాబాద్ నియోజకవర్గానికి సమకూరిన 6 శానిటేషన్ ఆటోలను ఆయన సీతాఫల్​మండి ముల్టీపర్పస్ హాల్ వద్ద ప్రారంభించారు.

డిప్యూటీ స్పీకర్ పద్మారావు కాసేపు శానిటేషన్ వాహనాన్ని నడిపారు. సికింద్రాబాద్​లోని అన్ని కాలనీలు, బస్తీలను పరిశుభ్రంగా ఉంచాలని, అవసరమైన పక్షంలో అదనంగా సిబ్బందిని, వనరులను సమకూర్చుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఉప కమిషనర్ మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు, తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఉన్నతాధికారుల పీఏనంటూ మోసాలు: సీపీ అంజనీకుమార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.