పేద ప్రజలందరూ సీఎంఆర్ఎఫ్ను సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ ఉపసభాపతి శ్రీ తీగుళ్ల పద్మారావు గౌడ్ సూచించారు. అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న ఓ వ్యక్తికి రూ. 5 లక్షల 50వేలు మంజూరు చేయించారు. సికింద్రాబాద్ సీతాఫల్మండిలోని బ్రాహ్మణ బస్తీకి చెందిన మధుకర్ యాదవ్ గత కొంతకాలంగా వైద్యం చేయించుకోలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విషయం తెలుసుకున్న ఉపసభాపతి.. సీఎంవోతో సంప్రదించి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. ఐదున్నర లక్షలు మంజూరు చేయించారు. నిధుల మంజూరు పత్రాన్ని ఆయనకు అందజేశారు. పేద ప్రజలు మెరుగైన వైద్యం చేయించుకునేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: జీహెచ్ఎంసీలో రానున్న 4 రోజులు శానిటైజేషన్: కేటీఆర్