ETV Bharat / state

eco friendly Diwali: మారుతున్న ఆలోచన.. గ్రీన్​ క్రాకర్స్​వైపు మొగ్గు

దీపావళి అంటేనే మనందరికీ  వెలుగులు చిమ్మే చిచ్చుబుడ్డీలు.... నింగి వైపు దూసుకెళ్లే రాకెట్లు.. శబ్దాలు చేసే బాంబులు గుర్తొస్తుంటాయి. అయితే ఆ సందడి మాటునే వాయు, శబ్ద కాలుష్యమూ పొంచి ఉంటోంది. వాటిని కాల్చటం వల్ల విడుదలయ్యే కాలుష్య ఉద్గారాలు దీనికి ప్రధాన కారణమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణానికి వీలైనంత తక్కువ నష్టం కలిగేలా హరిత బాణసంచా (గ్రీన్‌ క్రాకర్స్‌) అందుబాటులోకి వచ్చింది. రెండేళ్ల కిందటే మార్కెట్‌లోకి వీటి రాక మొదలైనప్పటికీ ఈ సారి మాత్రం కొంత విస్తృతంగానే లభిస్తున్నాయి.  వీటి ధరలు కొంచెం ఎక్కువే అయినా పర్యావరణ హితం దృష్ట్యా కొంతమంది వీటి వైపు మొగ్గు చూపిస్తున్నారు.

eco friendly Diwali
eco friendly Diwali
author img

By

Published : Nov 1, 2021, 2:39 PM IST

మనం కాల్చే సాధారణ బాణసంచా వల్ల కంటికి కనిపించని అతి సూక్ష్మ ధూళి కణాలు, సల్ఫర్‌ డై ఆక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్‌ వంటివి అధిక మొత్తాల్లో విడుదలై వాయు కాలుష్యానికి కారణమవుతుంటాయి. కొన్ని రకాల బాణసంచాలో అధిక కాలుష్య ఉద్గారాలను విడుదల చేసే బేరియం, లిథియం, ఆర్సెనిక్‌ వంటి మూలకాల్ని వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే పర్యావరణానికి వీలైనంత తక్కువ నష్టం కలిగించే బాణసంచా తయారీ ఫార్ములాను కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌)-నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (నీరి) రూపొందించి అభివృద్ధి చేశాయి. వాటినే హరిత బాణసంచాగా పిలుస్తారు.

ఇవి ఎందుకు మంచిది?

* సాధారణ బాణసంచాతో పోలిస్తే ఇవి 30-40 శాతం మేర తక్కువగా కాలుష్యకారక ఉద్గారాల్ని విడుదల చేస్తాయి.

* సాధారణ బాణసంచా కాల్చేప్పుడు 160 డెసిబెల్స్‌ మేర శబ్దం వస్తే... వీటి ద్వారా 100-125 డెసిబెల్స్‌ శబ్దం వస్తుంది.

* చిన్నచిన్న బాంబుల తయారీలో 33 శాతం అల్యూమినియం, 9 శాతం సల్ఫర్‌, 57 శాతం పొటాషియం నైట్రేట్‌ వినియోగిస్తారు. గ్రీన్‌ క్రాకర్‌లో ఈ రసాయన సమ్మేళనం అతి తక్కువ మోతాదులో ఉంటుంది.

హరిత బాణసంచా-రకాలు

* సేఫ్‌ వాటర్‌ రిలీజర్‌ (స్వాస్‌): పొటాషియం నైట్రేట్‌, సల్ఫర్‌ మోతాదు చాలా తక్కువగా ఉంటుంది. వీటిని కాల్చేటప్పుడు నీటి ఆవిర్లు విడుదలవుతాయి. గాల్లోకి ధూళి కణాలు చేరకుండా ఇది ఉపయోగపడుతుంది.

* సేఫ్‌ థర్మటిక్‌ క్రాకర్‌ (స్టార్‌): పొటాషియం నైట్రేట్‌, సల్ఫర్‌ మోతాదు చాలా తక్కువ. అతి తక్కువ మోతాదులో సల్ఫర్‌ డై ఆక్సైడ్‌, నైట్రోజన్‌ డై ఆక్సైడ్‌ విడుదలవుతాయి.

* సేఫ్‌ మినిమల్‌ అల్యూమినియం (సఫల్‌): అతి తక్కువ మోతాదులో ధూళికణాలు విడుదలయ్యేందుకు వీలుగా అల్యూమినియం బదులుగా మెగ్నీషియం వినియోగిస్తారు.

మార్కెట్లో వీటిని గుర్తించటం ఎలా?

* లోగో: మీరు కొనుగోలు చేసే బాణసంచా అట్టపెట్టెపై సీఎస్‌ఐఆర్‌- నీరి సంస్థలకు సంబంధించిన లోగో ‘‘గ్రీన్‌ ఫైర్‌ వర్క్స్‌’’ పేరిట ఉంటుంది. పెట్రోలియం అండ్‌ పేసో లైసెన్సు పొందినట్లు ఉంటుంది.

* క్యూఆర్‌ కోడ్‌: ఈ బాణసంచా అట్టపెట్టెపై ఉండే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే అది అసలైనదా.. నకిలీదా? ఏయే ముడి పదార్థాలు ఎంత మోతాదులో వాడారో తెలుస్తుంది.

ఎక్కడ లభిస్తాయి?

* ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన నగరాల్లోనూ గ్రీన్‌ క్రాకర్స్‌ లభిస్తాయి.

* సాధారణ వాటితో పోలిస్తే 10-20 శాతం వరకూ ధర అధికంగా ఉంటోంది. ఆన్‌లైన్‌లోనూ వివిధ సంస్థలు వీటిని విక్రయిస్తున్నాయి. పరిశీలించి కొనుగోలు చేసుకోవచ్చు.

ఇవీ చదవండి: SEED CRACKERS: మార్కెట్లోకి కొత్త సరుకు... పర్యావరణహిత బాణసంచా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.