ETV Bharat / state

పంజాగుట్ట ఠాణాలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభం

పంజాగుట్ట పోలీసు స్టేషన్​లో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్​ను పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఆదర్శవంతమైన పోలీసు స్టేషన్‌గా తీర్చిదిద్దడంలో భాగంగా సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌, పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఉన్నతమైన సేవలందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు డీసీపీ పేర్కొన్నారు.

author img

By

Published : Mar 3, 2021, 8:44 PM IST

dcp-ar-srinivas-inaugurated-solar-power-plant-at-panjagutta-police-station-in-hyderabad
పంజాగుట్ట ఠాణాలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభం

గతంలో జాతీయ స్థాయిలో రెండో ఉత్తమ పోలీసు స్టేషన్‌గా ప్రశంసలందుకున్న పంజాగుట్ట పోలీసు స్టేషన్‌ మరో మైలురాయికి చేరువైంది. పంజాగుట్ట ఠాణాలో మంచికొండ ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థ సహకారంతో రూ.10లక్షల వ్యయంతో సోలార్ విద్యుత్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సోలార్ విద్యుత్‌ ప్లాంట్‌తో పాటు సందర్శకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పార్కింగ్‌ స్థలాన్ని పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ప్రారంభించారు.

ఆదర్శవంతమైన పోలీసు స్టేషన్‌గా తీర్చిదిద్దడంలో భాగంగా సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌, పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను పోలీసు స్టేషన్‌, పక్కనే ఉన్న ఏసీపీ కార్యాలయానికి సరఫరా చేస్తామనిపేర్కొన్నారు. ఠాణాకు వచ్చే ఫిర్యాదుదారులు వివిధ పనుల కోసం వచ్చే సందర్శకులకు అసౌకర్యం కలుగకుండా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రజలకు ఉన్నతమైన సేవలందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు డీసీపీ తెలిపారు.

ఇదీ చదవండి: 'చెన్నమనేని కేసులో కౌంటర్​ దాఖలుకు వారం గడువు కావాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.