ఆర్థిక వనరుల సమీకరణ కోసం భూములు విక్రయించాలన్న మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. భూముల అమ్మకంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. కరోనా కారణంగా కోల్పోయిన ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వ, గృహనిర్మాణ సంస్థ భూములు అమ్మాలని రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం నిర్ణయించింది. అమ్మకం ప్రక్రియను ప్రారంభించాలని సీఎస్‌ను కేబినెట్ ఆదేశించింది. మంత్రివర్గ ఆదేశాలకు అనుగుణంగా సీఎస్ సోమేశ్ కుమార్ ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్థిక, పురపాలక, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శులు రామకృష్ణారావు, అర్వింద్ కుమార్, జయేశ్ రంజన్, అధికారులతో సీఎస్ సమావేశమయ్యారు. ప్రభుత్వ, గృహనిర్మాణ సంస్థ భూములు, ఇండ్ల అమ్మకంపై చర్చించారు. అందుబాటులో ఉన్న భూములు, అమ్మకానికి సిద్ధంగా ఉన్న భూముల వివరాలపై చర్చించిన సీఎస్... పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి : ఆనందయ్య మందు.. కోటయ్య మృతి