ఆజాదీ అమృత్‌కా మహోత్సవ్‌లో భాగంగా.... హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో సీఆర్పీఎఫ్ (CRPF) సైకిల్ ర్యాలీ నిర్వహించారు. గవర్నర్ తమిళిసై కార్యక్రమంలో పాల్గొని ర్యాలీని ప్రారంభించారు.
ఆగస్టు 22న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన సీఆర్పీఎఫ్ (CRPF) సైకిల్ ర్యాలీ అక్టోబర్ 2న గాంధీ జయంతిరోజు దిల్లీలో ముగియనుంది. నాలుగు రూట్లలో ఈ ర్యాలీ కొనసాగుతుండగా... ఇవాళ హైదరాబాద్‌కు చేరుకుంది. మొత్తం 4వేల కిలోమీటర్లకు పైగా ఈ ర్యాలీ జరగనుంది. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పాల్గొన్నారు.
ఆజాదీ అమృత్‌కా మహోత్సవ్‌లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా సీఆర్పీఎఫ్ చేపట్టిన ఈ ర్యాలీ గొప్ప కార్యక్రమం సీఆర్పీఎఫ్ జవాన్లను యువత ఆదర్శంగా తీసుకోవాలి. దేశ రక్షణలో భాగస్వామ్యం కావడానికి ముందుకు రావాలి. దేశ రక్షణతో పాటు అనేక కార్యక్రమాల్లో సీఆర్పీఎఫ్ భాగస్వామ్యం ఎంతో ఉంది. దేశ రక్షణలో ఎంతో మంది అమరులైన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఆగస్ట్ 2 నుంచి మహాత్మాగాంధీ జన్మదినం రోజు అక్టోబర్ 2న సైకిల్ ర్యాలీ న్యూదిల్లీ చేరుకోనుండటం గొప్ప రోజు. కరోనా మహమ్మరితో దేశం ఎంతో అతలాకుతలం అయింది. ఇప్పుడిపుడే కోలుకుంటున్నాం. అలా అని కరోనా మొత్తం పోయిందని అనుకోకుండా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకొని కరోనా నుంచి రక్షణ పొందాలి.
-- తమిళిసై, గవర్నర్
ఇదీ చూడండి: HYDERABAD DRINAGE SYSTEM: రూ.కోట్లు పెట్టి.. ప్రాణాలకు సమాధి కట్టి!