ETV Bharat / state

ప్రజాస్వామ్య విలువలు కాపాడుకోవాలి: రాఘవులు

author img

By

Published : Feb 10, 2021, 4:30 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని సీపీఎం పొలిట్​ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. ఈ నెల 15 నుంచి నెలాఖరు వరకు భాజపా నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు.

'ప్రజాస్వామ్య విలువలు కాపాడుకోవాలి'
'ప్రజాస్వామ్య విలువలు కాపాడుకోవాలి'

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలను అర్థం చేసుకోకుండా... ప్రధాని మోదీ అవమానపరుస్తున్నారని సీపీఎం పొలిట్​​ బ్యూరో సభ్యుడు రాఘవులు ఆరోపించారు. గతంలో ఉద్యమాలు గొప్పవని యువతను ఉత్తేజ పరిచిన మోదీ.... ఇప్పుడు ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు.

మోదీ నిరంకుశ పోకడలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని విమర్శించారు. ప్రత్యర్ధుల గొంతు నొక్కడానికి కేంద్ర సంస్థలను వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ట్విట్టర్​కు మోదీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసిందన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలనుకునే వారు సీపీఎం పోరాటంలో కలిసి రావాలని కోరారు. దేశంలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం పూనుకుందని వివరించారు. విశాఖ స్టీల్​ ప్లాంట్​ను, హైదరాబాద్​లో మిథాని ఫ్యాక్టరీలను కాపాడుకోకపోతే తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.

భాజపాను అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతాం

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస తెరాస బలహీనపడినట్లు గుర్తించడం సంతోషమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రంలో తెదేపా, కాంగ్రెస్​ పూర్తిగా బలహీనపడ్డాయని పేర్కొన్నారు. గుర్రంబోడు తండా భూములపై గతంలో సీపీఎం పెద్దఎత్తున పోరాటం చేసిందని తెలిపారు. కార్పొరేషన్, పట్టభద్రుల ఎన్నికల్లో విజయం కోసం భాజపా దూకుడుగా వ్యవహరిస్తోందని.... కమలదళాన్ని అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని తమ్మినేని వెల్లడించారు.

ఇదీ చూడండి: నాంపల్లి ఇంటర్​బోర్డు కార్యాలయం వద్ద ఏబీవీపీ ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.