రాష్ట్ర ప్రభుత్వ భూములపై శ్వేతపత్రం ప్రకటించి, జీవో నంబర్ 13ను ఉపసంహరించాలని సీపీఎం(cpm) డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ భూములు, ఆస్తులు అమ్మాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 13ను విడుదల చేయడాన్ని సీపీఎం(cpm) రాష్ట్ర కమిటీ వ్యతిరేకించింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కనీసం వెయ్యి ఎకరాలు విక్రయించాలని నిర్ణయించడం సరైంది కాదని… సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(tammineni veerabhadram) పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా విడుదల చేసిన… ఆ జీవోను తక్షణమే ఉప సంహరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో పేద రైతుల భూములను చౌకగా సేకరిస్తుందన్నారు. గతంలో పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను కూడా… ప్రభుత్వ అవసరాలకు తీసుకుందన్నారు. ఇప్పుడున్న లోటు బడ్జెట్‌ను పూడ్చుకోవడానికి భూములు అమ్మటం అంటే రాబోయే అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా… బాధ్యత రహితంగా వ్యవహరించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: Arrest: అనుమతి లేకుండా విత్తనాల వ్యాపారం, రూ.17లక్షల సరుకు స్వాధీనం