హైదరాబాద్ కేపీహెచ్‌బీలో లాక్‌డౌన్ అమలును సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు బజార్తో పాటు ఇతర ప్రాంతాల్లో పర్యటించి... మార్కెట్ కమిటీ, వ్యాపారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
దుకాణాల వద్ద వినియోగదారులు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల సహకారంతోనే కరోనా వ్యాప్తిని అరికట్టగలమని ఆయన సూచించారు.
ఇవీచూడండి: లాక్‌డౌన్ పాస్ అడిగినందుకు పోలీస్ చెయ్యి నరికివేత